RCB vs RR: రాజస్థాన్ టార్గెట్ 159

RCB vs RR: రాజస్థాన్ టార్గెట్ 159

Updated On : April 2, 2019 / 4:18 PM IST

రాజస్థాన్ బౌలర్లు విజృంభించారు. రహానె సేన ధాటికి బెంగళూరు 4వికెట్లు నష్టపోయి 158పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ(23), డివిలియర్స్(13)పరుగులు మాత్రమే చేయగలిగారు. పార్థివ్ పటేల్ ఒక్కడే జట్టులో హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో మెప్పించాడు. (67 పరుగులు ; 41 బంతుల్లో 9ఫోర్లు, 1సిక్సు)తో జట్టుకు కీలకంగా మారాడు. హెట్ మేయర్(1), మార్కస్ స్టోనిస్(31), మొయిన్ అలీ(18)పరుగులతో సరిపెట్టుకున్నారు. 

శ్రేయాస్ గోపాల్ ఒక్కడే (3)వికెట్లు పడగొట్టగా జోఫ్రా ఆర్చర్(1)వికెట్ తీయగలిగాడు.