తెలంగాణలో పబ్‌జీ కోసం చనిపోయిన బాలుడు

పబ్ జీ గేమ్ మనుషుల ప్రాణాలు తీస్తుంది..ఇప్పటికే పలువురు ఈ గేమ్ కారణంగా ప్రాణాలు తీసుకోగా తెలంగాణలో మరో యువకుడు పబ్ జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని వెంకట్రావ్ నగర్ కాలనీకి చెందిన బాలుడు(14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలకాలంలో ఎక్కువగా పబ్‌జీ గేమ్ ఆడుతుండడంతో గురువారం రాత్రి సెల్‌ఫోన్‌లో నుంచి పబ్‌జీ గేమ్‌ను తీసేసిన తల్లి గేమ్ ఆడొద్దని మందలించింది. దీంతో కోపంగా గదిలోకి వెళ్లిన బాలుడు ఉరేసుకుని చనిపోయాడు.
Also Read : వాల్మీకిగా వరుణ్ తేజ్ న్యూ లుక్ చూశారా?
గత కొన్నిరోజులుగా పబ్‌జీ గేమ్‌ను బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు. అదే పనిగా పబ్ జీ ఆడటం వల్ల మెడ నరాలన్నీ బిగుసుకు పోయి ఇటీవల ఒక తెలంగాణ కుర్రాడు చనిపోయిన సంగతి తెలిసిందే. పదుల సంఖ్యలో మరణాలు ఇప్పటికే చోటు చేసుకోగా రాబోయే రోజుల్లో పబ్‌జీ ప్రమాదంగా మారవచ్చునని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకి ఈ మృత్యుక్రీడ కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఈ గేమ్‌ను భారత్‌లో నిషేదించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Also Read : ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు