వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్

అమరావతి : దేశంలోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.81.554 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించి ఖర్చు పెట్టామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సీఎం చంద్రబాబు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో రైతులంతా పలు సమస్యలను ఎదుర్కొన్నారనీ..ఈ 10 సంవత్సరాలలో వ్యవసాయం అంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయే పరిస్ధితికొచ్చిందనివిత్తనాలు దొరక్కపోవటం వంటి పలు సమస్యలతో దిగుబడి తగ్గిపోయే దుస్ధితికి వ్యవసాయ రంగం వచ్చిందనీ..ఇటువంటి పరిస్థితుల్లో కోనసీమ రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారనీ ఇది చాలా దారుణమైన పరిస్థితి అన్నారు. అటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకూడదనీ..రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.అందుకే ఈ బడ్జెట్ లో రైతులకు ప్రత్యేక బడ్జెట్ ను తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.