జంప్ జిలానీలు : బీజేపీలో చేరుతున్న నేతలు

  • Published By: madhu ,Published On : October 3, 2019 / 07:55 AM IST
జంప్ జిలానీలు : బీజేపీలో చేరుతున్న నేతలు

Updated On : October 3, 2019 / 7:55 AM IST

తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు లీడర్స్.  వీరిని ఆకర్షించడానికి పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో చేరేందుకు వస్తున్న వారికి వెల్ కమ్ చెబుతోంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే కాషాయ కండువ కప్పుకున్నారు. తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు బీజేపీలో చేరేందుకు ఢిల్లీకి వెళ్లారు.

అక్టోబర్ 03వ తేదీ గురువారం బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌ను కలిశారు. సాయంత్రం 4 గంటలకు నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీ మారుతున్న వారిలో కాంగ్రెస్, జనసేన, టీడీపీ పార్టీలకు చెందిన వారు ఉన్నారు. 

ఏ పార్టీ నుంచి ఎవరు : – 
టీడీపీ నుంచి మాజీ మంత్ర శనగకాయల అరుణ, వాకాటి నారాయణరెడ్డి, పాతూరి నాగభూషణం, తోట నగేష్, గట్టి చిన సత్యనారాయణ.
జనసేన నుంచి చింతల పార్థసారధి.
కాంగ్రెస్ నుంచి బొబ్బిలి శ్రీనివాసరావులున్నారు. 
హైకోర్టు మాజీ న్యాయమూర్తి నక్కా బాలయోగి, తెలంగాణ రాష్ట్రం నుంచి టీడీపీ నేత వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరుతున్నారు. 

రాం మాధవ్ వారికి స్వాగతం పలికారు. చాలా మంది పార్టీలో చేరేందుకు ఢిల్లీకి వచ్చారని ఆయన వెల్లడించారు. నడ్డా సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకోనున్నట్లు తెలిపారు.