ధర్నాలు ఇక్కడ కాదు.. చంద్రబాబు ఇంటి ముందు చేయాలి: ఆర్కే

ధర్నాలు ఇక్కడ కాదు.. చంద్రబాబు ఇంటి ముందు చేయాలి: ఆర్కే

Updated On : January 5, 2020 / 9:44 AM IST

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజధాని తరలించొద్దని చేస్తున్న ఆందోళనల గురించి స్పందించారు. 10tvతో పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ కొందరి ఆస్తుల విలువో పెరిగితే సరిపోతుందా.. అందరి ఆస్తులు పెరగకూడదంటారా.. అమరావతి లాంటి ఖరీదైన భూములు 11జిల్లాల్లో ఎక్కడా లేవని తేల్చి చెప్పారు. 

‘చంద్రబాబు నాయుడు రాజధానికి ఓ శాపం. ఇన్ సైడర్ ట్రేడింగ్ తో వేలాది ఎకరాలు బయటపడుతున్నాయి. రైతుల పట్ల వైఎస్సార్ పార్టీకి ఎప్పుడూ సానుభూతి ఉంటుంది. నీరు కొండ ప్రాంతంలో నాకు 5ఎకరాలు ఉండటం వాస్తవమైతే.. నిరూపించగలిగితే రాజీనామా చేసి వెళ్లిపోతా. ఐదేళ్లుగా చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలకు మంగళగిరి ప్రజలు బుద్ధి చెప్పారు’ 

ఐదేళ్ల పాలనలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టలేకపోయాడు. సింగపూర్ టెక్నాలజీ అని చెప్పాడు. ఎక్కడా కనిపించడం లేదే. ఆయన వైఎస్సార్సీపీని ప్రశ్నించాలనుకుంటే ఆయన అభివృద్ధిచేసిన చోటులో నిల్చొని ధర్నా చేయమనండి. ఆయన చేసేందేం లేదు కాబట్టే బయటకు రాలేకపోతున్నాడు.

‘ప్రజా పక్షాన నిలిచాం కాబట్టే మేం గెలిచాం. భువనేశ్వరి ఎంటర్ అయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ డైలమాలో పడిందా. భార్యను తీసుకొచ్చి ఆందోళనలు చేయిస్తున్న చంద్రబాబు భయపడిపోయాడని తెలుస్తుంది. రాజధానిపేరుతో భారీగా లూటీ చేశారు. దళితుల భూములను కూడా భయపెట్టి సొంతం చేసుకున్నారు’

‘పవన్ రాజకీయనాయకుడిగా ఎవరూ గుర్తించలేదు. 2013-14లో మా గ్రామాలకు వచ్చి భరోసా చేశాడు పవన్. లాండ్ అక్విజేషన్ చేస్తే మీతో పాటు ఉంటానన్నపవన్.. సైలెంట్ గా ఉండిపోయాడు. మంగళగిరి, తాడికొండ ప్రాంతాల్లో అభ్యర్థులను ఎందుకు నిలబెట్టారు. అందుకే పవన్ కళ్యాణ్ ను ఎవరకూ పట్టించుకోవడం లేదు. 

రాజధాని సంబంధించినంత వరకూ ప్రభుత్వం స్పష్టమైనప్రకటన ఇచ్చేంతవరకూ ఆగాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనేది అక్షర సత్యం. దోషులకు శిక్షపడేలా వైఎస్సార్ ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక బయటపెట్టి ఉంటే బాగుండేది. నిష్పాక్షికంగా చేసిన సర్వేను బయటపెడితే పరిస్థితి మరోలా ఉండేదని ఆర్కే అన్నారు.