జుంబా డ్యాన్స్ పేరుతో అమ్మాయిలకు వల : లైంగిక వేధింపులు..పైసా వసూల్

జుంబా డ్యాన్స్ పేరుతో అమ్మాయిలకు వల వేసిన వారితో అసభ్యంగా వ్యవహరిస్తు..వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన మోసగాడి వ్యవహారం బైటపడింది. జుంబా డ్యాన్స్ నేర్పిస్తానంటూ మొదలైన ఆ మోసగాడి దగాతో చాలామంది యువతులు మాయలో పడ్డారు. వారిని తన డ్యాన్స్ స్కూల్లో పార్టనర్ ని చేస్తానంటూ భారీగా డబ్బులు దండుకున్న చిరంజీవి అనే వ్యక్తి సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కొన్నాళ్ల క్రితం మాదాపూర్‌లో చిరంజీవి జుంబా డ్యాన్స్ పేరుతో ఓ అకాడమీని ప్రారంభించాడు. ఆ డ్యాన్స్ చేస్తూ బరువు తగ్గుతారని, ఆకర్షణీయమైన శరీరం సౌష్ఠవాన్ని సొంతం చేసుకోవచ్చంటూ ప్రచారం చేశాడు. ధవవంతుల అమ్మాయిలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువతులను టార్గెట్ చేస్తు చక్కటి ప్రచారంతో ఆకట్టుకున్నాడు. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని ప్రముఖుల పిల్లలు జుంబా డ్యాన్స్ తో ఫిట్ నెస్ బిజినెస్ మొదలుపెట్టాడు. దీంతో వాడి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది.
తరువాత గచ్చిబౌలిలో మరో ట్రైనింగ్ సెంటర్‌ను ఓపెన్ చేస్తున్నానని దాంట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టొచ్చని చిరంజీవి చెప్పడంతో చాలా మంది సాఫ్ట్‌వేర్ యువతులు రూ.లక్షల్లో డబ్బులిచ్చారు. కానీ మాటల మాయగాడు బ్రాంచ్ ఓపెన్ చేయకుండా ఆ డబ్బుతో చిరంజీవి జల్సాలు చేశాడు. ఎన్ని రోజులైనా కొత్త బ్రాంచి ప్రారంభం కాకపోవడంతో డబులిచ్చిన అమ్మాయిలు చిరంజీవిని నిలదీయటంతో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మోసపోయామని అర్థమైంది.
దీంతో సైబరాబాద్ షీ టీమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదుచేశారు. ఈక్రమంలో చిరంజీవి డ్యాన్స్ పేరుతో అనేక మందిపై లైంగిక వేధింపులకు గురిచేసేవాడనీ..కానీ ఎవ్వరూ బైటపెట్టలేదు. ఈక్రమంలో డ్యాన్స్ క్లాసులకు వచ్చిన యువతులు ఒకరితో ఒకరు మాట్లాడుతున్న సందర్భంలో డబ్బుల విషయం బైటపడింది. కానీ అప్పటికే వారు డబ్బులు ఇవ్వటంతో చిరంజీవి లైంగిక వేధింపులకు పాల్పడినా కిక్కురుమనలేదు. దీని గురించి మాట్లాడితే తమ డబ్బులు ఎక్కడ ఇవ్వడోనని భయపడ్డారు.
చిరవరు చిరంజీవి మోసం బైటపడటంతో తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు చిరంజీవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.