Baboons Attack: మాతోనే పెట్టుకుంటావా? చిరుత పులిని తరిమితరిమి కొట్టిన బబూన్ కోతులు.. వీడియో వైరల్
చిరుత పులిని బబూన్ కోతులు తరిమికొట్టిన వీడియో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బబూన్ కోతుల ఐక్యతను మెచ్చుకుంటున్నారు.

Baboons Attack
Baboons Attacked To Leopard : చిరుత పులి ఎటాక్ చేసిందంటే అవతల ఎంతపెద్ద జంతువైనా బెంబేలెత్తిపోవాల్సిందే. జంతువులపై చిరుత అదునుచూసి దాడి చేస్తుంది. ఇదే క్రమంలో నడిరోడ్డుపై బబూన్ కోతి (కొండముచ్చు) పై ఎటాక్ చేసిన చిరుతకు చుక్కలు కనిపించాయి. అక్కడే ఉన్న మిగిలిన బబూన్ కోతులు ఒక్కసారిగా చిరుతపై దాడికి దిగాయి. వాటి దాడికి తట్టుకోలేక పోయిన చిరుత పులి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. అయినా బబూన్ కోతులు వదల్లేదు. అడవిలో కొద్దిదూరం వరకు చిరుతను పరుగులు పెట్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video : వామ్మో.. కిచిడీ కోసం.. పొట్టు పొట్టు కొట్టుకున్న టీచర్, వంట మనిషి.. వీడియో వైరల్
యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ సైటింగ్స్లో చిరుత పులిని బబూన్ కోతులు తరిమికొట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బబూన్ కోతుల ఐక్యతను తెగ మెచ్చుకుంటున్నారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది. రిక్కీ దా ఫోనెస్కా షేర్ చేసిన ఈ వీడియోలో.. రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ బబూన్ కోతుల గుంపు రోడ్డుపైకి వచ్చింది. దీంతో రోడ్డుకు అటువైపు ఇటువైపు కార్లు ఆగిపోయాయి. రోడ్డుపై గుంపుగా బబూన్ కోతులు దర్జాగా వెళ్తున్నాయి. బబూన్ కోతుల గుంపును చూసిన చిరుత పులి వాటిపై దాడిచేసేందుకు సిద్ధమైంది. అయితే, అవి 50వరకు ఉండటంతో వెనుకడుగు వేసింది.
woman viral video : చీరకట్టుతో రోమ్ వీధుల్లో తిరిగిన భారతీయ మహిళ.. మంత్రముగ్ధులైన ఇటాలియన్లు
చిరుత పులి తెలివిగా బబూన్ కోతుల గుంపులో వెనుకాల నడుస్తున్న చిన్న బబూన్ కోతిపై ఒక్కసారిగా దాడికి దిగింది. ముందు వెళ్తున్న బబూన్ కోతులు చిరుత పులి దాడిని గమనించి వెనక్కు వచ్చి చిరుతపై ఒక్కసారిగా దాడికి దిగాయి. ఊహించని ఘటనతో ఉక్కిరిబిక్కిరి అయిన చిరుత వాటి దాడినుంచి తప్పించుకొనేందుకు పరుగు లంకించుకుంది. అయినా, బబూన్ కోతులు వదల్లేదు.. కొద్దిదూరం చిరుతను తరిమితరిమి కొట్టాయి. ఇందుకు సంబంధించిన వీడియోను రోడ్డుపై ఆగిఉన్న కారులోని వ్యక్తులు తీశారు. ఆ వీడియోను యూట్యూబ్ లో షేర్ చేయగా నెట్టిట్లో వైరల్గా మారింది.