ప్లాస్టిక్ బాటిళ్లే పూలకుండిలు: మహిళలకు ఉపాధి ఇదే

ప్లాస్టిక్ తో తయారైయిన బాటిల్, కవర్ల వాడాకాన్ని ప్రభుత్వం నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. కానీ ఛత్తీస్ ఘడ్ అటవీ శాఖ మాత్రం ప్లాస్టిక్ బాటిల్స్ లో మెుక్కలను పెంచ్చుతూ.. ఒక కొత్త ఆలోచనతో మహిళలకు ఉపాధి కల్పించింది.
ఛత్తీస్ ఘడ్ లోని రామానుజ్గంజ్ నర్సరీలో.. పర్యావరణంలో భాగంగా అక్కడ ఉన్న మహిళా కార్మికుల సహాయంతో మొక్కలను పెంచడానికి వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లను రీసైకిల్ చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికురాలు మాట్లాడుతూ.. మేము నగరాల నుంచి వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ ను ఇక్కడకు తీసుకున్ని వచ్చి వాటిని కత్తిరించి వాటిలో మట్టిని నింపి మెుక్కలను వేస్తాం అని చెప్పారు.
నర్సరీ మేనేజర్ లాలన్ సిన్హా మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేధించిన తర్వాత నుంచి మేము ఈ పద్ధతిని అనుసరిస్తున్నాము అని తెలిపారు. మహిళలు వాడి పాడేసిన బాటిల్స్ సేకరించి వారి ఇండ్ల వద్ద లేదా నర్సరీలో వాటిని తయారు చేస్తారు. బాటిల్స్ ను కత్తిరించి వాటికి కరెంట్ పాసైయ్యే విధంగా రెండు రంథ్రాలు చేస్తారు. మట్టి, ఆవు పేడతో బాటిల్ నింపి అందులో మెుక్కలను నాటుతారని అని తెలిపారు.
ఇక జిల్లా అటవీ శాఖ అధికారి ప్రణయ్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ విధంగా 3 వేల పూల కుండిలను తయారుచేసామని అన్నారు. ఈ పద్ధతి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించబడుతుంది. ఇలా తయారు చేసిన మెుక్కలు సుమారు రెండేళ్ల పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము అని ఆయన తెలిపారు.
Chhattisgarh: Under an initiative by Divisional Forest officer Balrampur Pranay Mishra, waste plastic bottles are being used to plant & grow saplings at Ramanujganj nursery. He says “Prepared around 3000 plants. This also provides employment. We pay them on a daily basis” (07.12) pic.twitter.com/2XRkOOjo5o
— ANI (@ANI) December 8, 2019