యూపీలో అర్థ కుంభమేళా : ఏపీలో ‘కోడి కుంభమేళా’

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా జరుగుతుంటే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని కోడి కుంభమేళ జరుగుతోందంటు ఓ ఫోటో వైరల్ గా మారింది.యూపీ కుంభమేళాకు ఏమాత్రం తక్కువ కాకుండా భీమవరంలో కోడి కుంభమేళా జరుగుతోందంటు ఫోటో వైరల్..

  • Published By: veegamteam ,Published On : January 16, 2019 / 05:33 AM IST
యూపీలో అర్థ కుంభమేళా : ఏపీలో ‘కోడి కుంభమేళా’

ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళా జరుగుతుంటే ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల్లోని కోడి కుంభమేళ జరుగుతోందంటు ఓ ఫోటో వైరల్ గా మారింది.యూపీ కుంభమేళాకు ఏమాత్రం తక్కువ కాకుండా భీమవరంలో కోడి కుంభమేళా జరుగుతోందంటు ఫోటో వైరల్..

యూపీలో అర్థ కుంభమేళా
ఏపీలో ‘కోడి కుంభమేళా’
గోదావరి జిల్లాల్లో
సంక్రాంతి సంబరాలు
​​​​​​​జోరుగా కోడి పందాలు
భీమవరంలో కోడి కుంభమేళా
కోడి పందాల్లో కోట్ల రూపాయలు 
ఇతర రాష్ట్రాల నుండి భారీగా వచ్చిన జనం
డ్రోన్ కెమెరాలతో ఫోటోలు  
సోషల్ మీడియాలో  వైరల్ 

 

భీమవరం : సంక్రాంతి పండగ సంబరాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో కోడి పందాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఏమాత్రం తక్కువ కాకుండా భీమవరంలో కోడి కుంభమేళా జరుగుతోందంటు ఓ ఫోటో వైరల్ గా మారింది. కోట్లాదిమంది యూపీ అర్థ కుంభమేళాకు వెళుతుంటే..లక్షలాదిమంది ఈ కోడి కుంభమేళాలో పందెం రాయుళ్లు హల్ చల్ చేస్తున్నారంటు ఫోటో వైరల్ గా మారింది. 

పందాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ వైపు పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా…ఏమాత్రం ఖాతరు చేయకుండా గడచిన రెండు రోజుల్లో భీమవరం, ఉండి, ఏలూరు, నరసాపురం, కాకినాడ, పిఠాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో జరిగిన పందాల్లో వందల కోట్ల రూపాయలు పందాలు జరుగతునే వున్నాయి. ఈ కోడి పందాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. వంటి పలు ప్రాంతాల నుండి పందెం రాయుళ్లు వచ్చి మకాం వేశారు. ఇక భీమవరం సమీపంలో ఏర్పాటు చేసిన పందెం బరులకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించారు. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా, వైభవంగా ప్రారంభమైన వేళ, ఈ ఫొటోకు ‘కోడి కుంభమేళా’ అని ట్యాగ్ కూడా తగిలించారు.