మహిళను వెక్కిరిస్తు డ్యాన్స్ చేసిన కుక్క.. వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 09:50 AM IST
మహిళను వెక్కిరిస్తు డ్యాన్స్ చేసిన కుక్క.. వైరల్ వీడియో

Updated On : December 16, 2019 / 9:50 AM IST

కుక్కకి ఉన్న విశ్వాసం, తెలివి మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఈ శునకం. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఇవి చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో కుక్కల పేర్ల పై వేల కొద్ది అకౌంట్లు ఉన్నాయి.

తాజాగా ఫ్లోరిడాలో నివసిస్తున్న వెండి బెరెంగుయర్ అనే మహిళ తన పెంపుడు కుక్క బెయిలీ చేసిన డాన్స్ వీడియోని ఫేస్ బుక్ లో పెట్టింది. కిచెన్ ఫ్లోర్ పై ప్యూర్టోరికో సాంగ్ వింటూ, మహిళా తో కలిసి డాన్స్ చేసింది.  

అందరు ఆశ్చర్యపోయే విధంగా తన రెండు కాళ్ళ పై నిలబడి 20 సెకండ్ల పాటు ఆ మహిళను వెక్కిరిస్తు డాన్స్ చేసింది. అయితే బెయిలీ లవర్స్ రెగ్గీటన్ క్యాప్షన్ తో రిలీజైన వీడియో ఇప్పటికే వైరల్ గా మారింది.