కరోనాను ఖతం చేస్తా :ప్రెషర్ కుక్కర్ ఆవిరితో కూరగాయల్ని కడిగేస్తున్న ఇల్లాలు..

  • Published By: nagamani ,Published On : July 28, 2020 / 12:24 PM IST
కరోనాను ఖతం చేస్తా :ప్రెషర్ కుక్కర్ ఆవిరితో కూరగాయల్ని కడిగేస్తున్న ఇల్లాలు..

Updated On : July 28, 2020 / 1:02 PM IST

కరోనా వైరస్ వచ్చిన తరువాత ఇంటిపనే కాదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు..పండ్లు ఒకటికి పది సార్లు కడుక్కోవటం పెద్ద పనిగా మారిపోయింది. కొంతమంది జాగ్రత్త కోసం ఉప్పునీటితో కడుక్కుంటున్నారు. ఇంత వరకూ బాగానేఉంది. కానీ..ఛాదస్తమో ఏమో తెలీదు గానీ ఇంకొందరైతే ఏకంగా సర్ఫ్ తో నానబెట్టి..బ్రష్ తో బట్టలు వాష్ చేసినట్లుగా తెగ రుద్దేస్తున్నారు. అయినా సరే ఇంకా అనుమానం..భయం వాటిపై కరోనా వైరస్ ఉందేమోనని. కానీ తప్పుదగా వండుకుని తింటున్నారు.

కానీ ఓ ఇల్లాలు మాత్రం కూరగాయలను శుభ్రం చేయడం ఓ క్రేజీగా మారింది. ప్రెషన్ కుక్కర్ లోంచి వచ్చే ఆవిరితో వైరస్‌ను ఖతం చేయాలనుకుంది. దాని కోసం కుక్కర్‌కు విజిల్ వచ్చే రంధ్రం దగ్గర ఒక పైపు పెట్టి కూరగాయలను శుభ్రపరిచేస్తోంది. అలా..కూరగాయలన్నింటినీ ప్రెషర్ కుక్కర్ ఆవిరితో కడిగేస్తోంది. దీనికి సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మరి మీరు కూడా చూడండీ..ఈ ఇల్లాలి కొత్త తరహా కూరగాయల కడుగుడు..