Ap Rains : ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులు వర్షాలు..!

నైరుతి రుతుపవనాలు కేరళను తాకి జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Ap Rains : ఏపీకి చల్లని కబురు.. మూడు రోజులు వర్షాలు..!

Ap Rains : దక్షిణ తమిళనాడు నుంచి లక్షద్వీప్ వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయంది. ఈ నెల 19న అండమాన్ పరిసరాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 31న నైరుతి రుతుపవనాలు కేరళను తాకి జూన్ తొలి వారంలో ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

సునంద- వాతావరణ శాఖ అధికారి
”ద్రోణి ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల భారీ వానలు పడే అవకాశం ఉంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. 18వ తేదీన కూడా వర్షాలు పడతాయి. ద్రోణి ప్రభావంతో క్లౌడీ వెదర్ ఉంది. కొన్ని చోట్ల డెన్స్ క్లౌడింగ్ ఉంది. కొన్ని చోట్ల తక్కువ క్లౌడింగ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో కొంచెం ఎండ వాతావరణం ఉంటుంది. దక్షిణ ఆంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతం క్లౌడీగా ఉంది. సాధారణమైన టెంపరేచర్లు నమోదవుతాయి. దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడతాయి.

ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షానికి అవకాశం ఉంది. మిగతా ప్రాంతం అంతా మేఘావృతమై ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో క్లౌడీ వాతావరణం ఉంటుంది, ఎండ వాతావరణం కూడా ఉంటుంది. క్లౌడ్ ఫ్రీ ఉన్న చోట ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది”.

Also Read : వడ్ల కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం.. తెలంగాణకు మళ్లీ వర్ష సూచన