Tirupati Rain : హమ్మయ్య.. ఎట్టకేలకు కురిసిన వర్షం.. తిరుపతి, తిరుమలలో చల్లబడిన వాతావరణం

ఎండవేడిమితో అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

Tirupati Rain : హమ్మయ్య.. ఎట్టకేలకు కురిసిన వర్షం.. తిరుపతి, తిరుమలలో చల్లబడిన వాతావరణం

Tirupati Rain : దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మాడు పగిలేలా ఉన్న ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. ఓవైపు ఎండలు, ఉక్కపోత మరోవైపు వడగాలులు.. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో చాలా ప్రాంతాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ వేసవి కాలం అయిపోతుందా? మండుటెండల నుంచి విముక్తి లభిస్తుందా? అని జనం ఎదురుచూస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరుమలలో వర్షం కురిసింది. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. స్వామి వారి భక్తులు చిరుజల్లులతో సేదతీరారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత తిరుమలగిరుల్లో ఓ మోస్తరు వర్షం పడింది. ఎండవేడిమితో అల్లాడిపోతున్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో పాటు వడగాలులు వీస్తూ జనాన్ని మాడ్చేస్తున్నాయి. అయితే, తిరుపతిలో ఒక్కసారిగా జల్లులు కురిసి వాతావరణం కాస్త చల్లబడింది. నగరంలో అక్కడక్కడ చినుకులు పడటంతో జనం కొంత సేదతీరారు.

Also Read : నిప్పుల కుంపటిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

జాగ్రత్త.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు..
తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది. మాడు పగిలే ఎండలతో జనం విలవిలలాడిపోతున్నారు. సాధారణం కంటే అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండిపోతున్న ఎండల ధాటికి జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, దక్షిణ నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాలుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.

మొత్తంగా 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలు చోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 6వరకు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ.. అక్కడక్కడ తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా సగటున ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా 46.6 డిగ్రీలుగా నమోదైంది.

Also Read : పెన్షన్ డబ్బు తీసుకునేది ఎలా? ఏపీలో వృద్ధుల తీవ్ర అవస్థలు, చంద్రబాబే కారణం అంటున్న వైసీపీ