ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

  • Published By: chvmurthy ,Published On : September 15, 2019 / 07:42 AM IST
ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Updated On : September 15, 2019 / 7:42 AM IST

ఆంధ్ర ప్రదేశ్ నూతన లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి. లక్ష్మణ రెడ్డి ఆదివారం 2019, సెప్టెంబరు 15న  ప్రమాణస్వీకారం చేశారు.‌ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్, ఎపి లోకాయుక్తగా జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.

జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన లోకాయుక్త జస్టిస్ శ్రీ పి.లక్ష్మణరెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.