Snake Gets Stuck In Ear: అమ్మాయి చెవిలో దూరిన సన్నపాటి పాము..? వీడియో వైరల్

చెవిలో చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. అటువంటి ఓ అమ్మాయి చెవిలో సన్నపాటి పాము దూరింది. ఆ పామును వైద్యుడు బయటకు తీస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాము పసుపు రంగులో ఉంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టతలేదు. చెవిలో పాము దూరిందని ఓ యువతి వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆమె చెవిని పరీక్షించిన వైద్యుడు పామును బయటకు తీసే ప్రయత్నం చేశాడు.

Snake Gets Stuck In Ear: అమ్మాయి చెవిలో దూరిన సన్నపాటి పాము..? వీడియో వైరల్

Snake Gets Stuck In Ear

Snake Gets Stuck In Ear: చెవిలో చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. అటువంటి ఓ అమ్మాయి చెవిలో సన్నపాటి పాము దూరింది. ఆ పామును వైద్యుడు బయటకు తీస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాము పసుపు రంగులో ఉంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టతలేదు. చెవిలో పాము దూరిందని ఓ యువతి వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆమె చెవిని పరీక్షించిన వైద్యుడు పామును బయటకు తీసే ప్రయత్నం చేశాడు.

అయితే, ఆ సమయంలో ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆ సమయంలో మరో వ్యక్తి ఈ దృశ్యాలను స్మార్ట్ ఫోనులో తీశాడు. వైద్యుడు పలు పరికరాలతో పామును బయటకు తీస్తుండగా పాము కదులుతూ కనపడుతోంది. యువతి చెవిలో నుంచి పాము తల మాత్రమే బయటకు వచ్చింది. ఈ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఫేక్ వీడియో అయి ఉండొచ్చని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. పాము చెవిలో పట్టే అవకాశం ఉంటుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు