Sri Lanka vs India: టీమిండియాకు షాక్.. మరో ప్లేయర్ అవుట్.. ఆఖరి టీ20లో ఆడేదెవరు?

భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది.

Sri Lanka vs India: టీమిండియాకు షాక్.. మరో ప్లేయర్ అవుట్.. ఆఖరి టీ20లో ఆడేదెవరు?

Ind Sri

Sri Lanka vs India, 3rd T20I: భారత్, శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ గురువారం(29 జులై 2021) భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు జరగనుంది. ఇంతకుముందు, ఇరు జట్లు ఒక్కొక్క మ్యాచ్ గెలవగా.. మూడో మ్యాచ్ కీలకం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఈ మ్యాచ్‌తో విజేతలు ఎవరో డిసైడ్ అవ్వనుంది. మొదటి మ్యాచ్‌లో యంగ్ జట్టుతో అలవోకడగా విజయం సాధించిన భారత్.. రెండవ మ్యాచ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

టీమ్ ఇండియా నుంచి ప్రస్తుతం 9 మంది ఆటగాళ్ళు మాత్రమే అందుబాటులో ఉన్నారు. చివరకు రెండవ మ్యాచ్ కేవలం ఐదుగురు బ్యాట్స్‌మెన్లతో, అందులోనూ నలుగురు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసేవారితో ఆడాల్సిన పరిస్థితి. కీలకమైన ఆటగాళ్లు ఎవరూ లేరు. ముఖ్యంగా హర్థిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా వంటి ఆటగాళ్లు లేని ఈ పరిస్థితిలో రెండవ టీ20 మ్యాచ్లో ఆతిథ్య జట్టు భారత జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్‌కు రెండో మ్యాచ్‌లో ఆడినవారిలో కూడా ఒకరు దూరం అవ్వడం షాకింగ్. శ్రీలంకకు పోటీని ఇవ్వగల జట్టును ఎన్నుకోవడానికి అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితిలో మూడో మ్యాచ్‌లో విజయం చాలా కష్టమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

జట్టు ఓపెనర్ల విషయానికి వస్తే, రెండవ టీ20లో కెప్టెన్ శిఖర్ ధావన్‌తో ఆరంగ్రేటం చేసిన రితురాజ్ గైక్వాడ్ మరోసారి ఇన్నింగ్స్ తెరిచే అవకాశం ఉంది. అదే సమయంలో, దేవదత్ పాడికల్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చు. దేవ్‌దత్ తరువాత, నితీష్ రానా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు, సంజు శాంసన్ ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. అయితే రెండో మ్యాచ్‌లో నితీష్ రానా, సంజు ఇద్దరూ సరిగ్గా ఆడలేకపోయారు.

జట్టు వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశారు. జట్టులోని స్పిన్నర్ల గురించి మాట్లాడుతూ కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. రెండో మ్యాచ్‌లో కుల్దీప్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో భువి పర్వాలేదు అనిపించాడు. కానీ, డెత్ ఓవర్లలో సిక్స్ కొట్టించడం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అయ్యింది. అతనితో పాటు చేతన్ సకారియా కూడా ఆడాడు.

రెండో మ్యాచ్‌లో అందుబాటులో ఉన్న నవదీప్ సైనీ ఆ మ్యాచ్‌కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. రెండవ టీ20 మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు నవదీప్ సైని భుజానికి గాయమైంది. ఈ కారణంగా, అతను ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. అతని స్థానంలో, రిజర్వు బౌలర్‌గా శ్రీలంకకు వెళ్లిన సందీప్ వారియర్ లేదా అర్ష్‌దీప్ సింగ్‌కు జట్టులో స్థానం దక్కవచ్చు.

మూడవ టీ20 కోసం టీమిండియా Probable XI:
శిఖర్ ధావన్ (కెప్టెన్), దేవదత్ పాడికల్, రితురాజ్ గైక్వాడ్, నితీష్ రానా, సంజు శాంసన్(wk), భువనేశ్వర్ కుమార్(వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్, చేతన్ సకారియా, సందీప్