Chay-sam : మేమిద్దరం విడిపోయి హ్యాపీగానే ఉన్నాం.. విడాకులపై స్పందించిన చైతూ
'బంగార్రాజు' సినిమా ప్రమోషన్స్‌లో నాగచైతన్య విడాకుల గురించి మీడియా అడిగిన ఓ ప్రశ్నకి స్పందిస్తూ...''ఇద్దరి మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను
Chay-sam : నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం చాలా రోజులు వార్తల్లో నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలు వీరిద్దరి గురించి చాలా రోజులు హాట్ టాపిక్‌గా మాట్లాడుకున్నారు. విడాకుల తర్వాత ఎవరి పని వాళ్ళది అన్నట్టు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విడాకుల తర్వాత సమంత కొన్ని సార్లయినా ఈ విడాకుల అంశంపై డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో స్పందించింది కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ లో ఉన్న చైతూ విడాకులపై తొలిసారిగా స్పందించాడు.
Radha : మళ్ళీ తెరపై కనపడనున్న అలనాటి అందాల తార రాధ
‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌లో నాగచైతన్య విడాకుల గురించి మీడియా అడిగిన ఓ ప్రశ్నకి స్పందిస్తూ…”ఇద్దరి మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆమె సంతోషంగా ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. ఈ పరిస్థితిలో ఇది మా ఇద్దరికీ బెస్ట్ డెసిషన్. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపాడు. సామ్ తో విడాకుల అనంతరం నాగ చైతన్య విడాకులపై వ్యాఖ్యలు చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.