Ashureddy : ఆర్జీవీ నుంచి నేర్చుకున్నాం అంటూ.. అరియనా నడుముపై అషూరెడ్డి ముద్దు.. నెటిజన్స్ ట్రోలింగ్
ఇటీవల ఒక షోలో పార్టిసిపేట్ చేసిన వీరిద్దరూ ఒక ఫోటో దిగారు. ఆ ఫొటోలో అషూ.. అరియానా నడుముకి ముద్దు పెట్టింది. దీంతో అరియనా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తో ఫోటో తీసి అషూ ఇన్స్టాగ్రామ్లో...
Ariyana Glory : అరియానా గ్లోరీ, అషూరెడ్డి సోషల్ మీడియా స్టార్లు. సోషల్ మీడియాతో వచ్చిన ఫేమ్ ని వాడుకొని బిగ్ బాస్ దాకా వెళ్లారు. అషూ బిగ్ బాస్ మూడో సీజన్లో, అరియానా నాలుగో సీజన్లో పాల్గొన్నారు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో వరుస అవకాశాలు సంపాదించుకొని బిజీ అవుతున్నారు. ఇక ఆర్జీవీ వీళ్ళిద్దరితో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి వీళ్ళకి ఫాలోయింగ్ ని మరింత పెంచారు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో, షోలతో బిజీగా ఉన్నారు. తాజాగా వీరిద్దరూ చేసిన ఓ పనికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు.
ఇటీవల ఒక షోలో పార్టిసిపేట్ చేసిన వీరిద్దరూ ఒక ఫోటో దిగారు. ఆ ఫొటోలో అషూ.. అరియానా నడుముకి ముద్దు పెట్టింది. దీంతో అరియనా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తో ఫోటో తీసి అషూ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీనికి హద్దులు లేని ఎక్స్ప్రెషన్ అని కామెంట్ పెట్టి పోస్ట్ చేసింది. దీనికి అరియానా.. ‘ఒసేయ్ అషూ నీకు, నీ క్రేజీనెస్కి దండం. పాపం అందరూ తప్పుగా అనుకుంటున్నారే, జడ్జిమెంటల్ అవుతున్నాం’ అని కామెంట్ పెట్టగా దీనికి అషూ రెడ్డి స్పందిస్తూ.. ‘మంచైనా, చెడైనా ప్రజలెప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు. అలా అని మన క్రేజీనెస్ని వదిలేయకూడదు. అదే మనల్ని ఇతరుల కన్నా ప్రత్యేకంగా చూపిస్తుంది. ఈ విషయం మనం ఆర్జీవీ నుంచే నేర్చుకున్నాము’ అని రిప్లై ఇచ్చింది..
Vishwak Sen : విశ్వక్సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.. టీజర్ రిలీజ్.. మార్చ్ 4న థియేటర్స్లో..
దీంతో నెటిజన్లు ఈ ఫోటోని ట్రోల్ చేస్తున్నారు. ‘ఈ పోస్ట్ వల్ల ఉపయోగం ఏంటో ఎవరైనా చెప్తారా?’, ‘ఏదో తేడాగా ఉందే’, ‘ఈ ఫొటో ఆర్జీవీ కానీ చూడాలి’, ‘లెస్బియన్స్ అంటే వినడమే తప్ప చూడలే అనుకున్నా, కానీ ఇప్పుడు చూసేశా’, ‘ఇది చాలా టూమచ్’ అంటూ ఇలా రకరకాల కామెంట్లు చేస్తూ వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అషూ, అరియనా మాత్రం ఈ కామెంట్లని చూసి నవ్వుకొని వదిలేసి వారి పని వారు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.