Bigg Boss Non Stop: మొదలైన ఎలిమినేషన్స్.. తొలి వారం ముమైత్ ఔట్!
మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో వారం గడిచిందో లేదో ఎలిమినేషన్ మొదలైంది. తొలి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుండి బయటకొచ్చేసింది. దీంతో ప్రస్తుతం..
Bigg Boss Non Stop: మొత్తం 17 మందితో మొదలైన నాన్ స్టాప్ బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో వారం గడిచిందో లేదో ఎలిమినేషన్ మొదలైంది. తొలి వారం ముమైత్ ఖాన్ హౌస్ నుండి బయటకొచ్చేసింది. దీంతో ప్రస్తుతం ఇంట్లో 16 మంది మాత్రమే ఉన్నారు. హౌస్ లో పాత కంటెస్టెంట్లను వారియర్స్ గా.. కొత్త వారిని చాలెంజర్స్ గా బిగ్ బాస్ టీమ్స్ చేసిన సంగతి తెలిసిందే కాగా.. ముమైత్ ఎలిమినేషన్ తో వారియర్స్ లో ఒక కంటెస్టెంట్ తగ్గారు. దీంతో వారియర్స్ ఇప్పుడు కసితో గేమ్స్ మొదలు పెడుతున్నారు.
Bigg Boss OTT Telugu: కాలేజీలో ప్రేమ.. బిందు మాధవి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రాగానే బజ్ షోను నిర్వహించే సంగతి తెలిసిందే. కాగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో యాంకర్ రవి ఈ షోకు హోస్ట్‌గా కనిపించాడు. ఈ సందర్భంగా రవితో కలిసి బిగ్‌బాస్ హౌజ్ ముచ్చట్లు చెప్పిన ముమైత్ మిగతా కంటెస్టెంట్స్‌పై అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. బిందు మాధవిని నాగినితో పోల్చిన ముమైత్.. శ్రీరాపాకకు పొగరని, సరయూకి మహానటి, మహేష్ విట్టాకి మాస్, ఆర్జే చైతూకి మూతి మీద పంచ్ స్టిక్కర్స్ ఇచ్చిన ముమైత్.. అనిల్ కు హార్ట్ సింబల్ ఇచ్చి.. తేజస్వి ముదివాడని మంచి అమ్మాయి అంటూ తెగ పొగిడేసింది.
Bigg Boss OTT Telugu: హౌస్ నిండా బోల్డ్ బ్యూటీస్.. బిగ్‌బాస్ ఏం స్కెచ్ వేశాడో?
ఇక తన తర్వాత హౌజ్‌ను వీడేది ఎవరని అడగ్గా.. ఆర్జే చైతూ అంటూ ధీమాగా సమాధానం ఇచ్చింది. మరోవైపు హౌస్ లో రెండో వారం ఎలిమినేషన్స్ కూడా మొదలు పెట్టిన బిగ్ బాస్.. ఫోటోలతో కూడిన స్టాండ్స్ పెట్టిన బిగ్ బాస్.. ఎవరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో డాగర్ ఫోటోపై గుచ్చాలని చెప్పడంతో కంటెస్టెంట్స్ వాళ్ళకి నచ్చని వాళ్ళని నామినేట్ చేస్తూ డాగర్ దింపారు. నామినేట్ చేసిన వారి సమాధానాలు.. కంటెస్టెంట్ల వాదనతో సోమవారం షో కూడా సందడిగానే కనిపిస్తుంది.