AP BJP: ఏపీలో పట్టుసాధించేందుకు బీజేపీ కసరత్తు.. క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా...

AP BJP: ఏపీలో పట్టుసాధించేందుకు బీజేపీ కసరత్తు.. క్షేత్రస్థాయిలో బలోపేతంపై దృష్టి

Bjp

AP BJP: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాధులు అధికార తెరాసను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో పాటు నియోజకవర్గాల వారిగా పార్టీ బలోపేతం పై తెలంగాణలోని సీనియర్ బీజేపీ నేతలు దృష్టి కేంద్రీకరించారు. అయితే ఏపీలో బీజేపీ ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదన్న భావన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ పెద్దలు కార్యాచరణ రూపొందించారు. ఏపీలో సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా చేసుకొని బుధవారం నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహించనున్నారు.

AP BJP: ఎల్లుండి నుంచి బీజేపీ ఉత్తరాంధ్ర పాదయాత్ర

బుధవారం విశాఖ పట్టణంలో ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం నిర్వహించనున్నారు. 28న రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ సమావేశం, 29న గుంటూరు కోస్టల్ జోన్ సమావేశం, 30న అనంతపురంలో రాయలసీమ జోన్ సమావేశాలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కేంద్ర మంత్రి మురళి ధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ సభ్యులు పాల్గోనున్నారు.