Rakesh Master : రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని చెప్పేశారు.. రాకేశ్‌ మాస్టర్‌ అసిస్టెంట్‌ కామెంట్స్!

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూశారు. అయితే రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించారట.

Rakesh Master : రెండు నెలలు క్రిందటే డాక్టర్లు ఆయన బతకడం కష్టమని చెప్పేశారు.. రాకేశ్‌ మాస్టర్‌ అసిస్టెంట్‌ కామెంట్స్!

Rakesh Master assistant says health problem to media

Rakesh Master : టాలీవుడ్ లోని సీనియర్ కొరియోగ్రఫర్‌ రాకేశ్‌ మాస్టర్‌ కన్నుమూశారు. ఈరోజు (జూన్ 18) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కి తరలించారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే రెండు మూడు రోజులు క్రితం వరకు ఆయన కొన్ని యూట్యూబ్ వీడియోలు ద్వారా ఆడియన్స్ కి చేరువలోనే ఉన్నారు. ఇప్పుడు ఇంతలోనే ఏమైందని అందరు ఆరా తీస్తున్నారు.

Fathers Day : ఫాదర్స్ ప్రేమలో హీరోహీరోయిన్లు.. బన్నీ, కాజల్ స్పెషల్ పోస్టులు..

ఇక ఈ విషయం పై రాకేశ్‌ మాస్టర్‌ అసిస్టెంట్‌ సాజిత్‌ స్పందించారు. రెండు నెల్లలు క్రిందట హనుమాన్ మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్న సమయంలో మాస్టర్‌కు వాంతులు, విరోచనాలు అయ్యాయని, దీంతో అప్పుడు హాస్పిటల్ కి తీసుకు వెళ్లగా.. డాక్టర్లు ఆయన బతకడం కష్టమని, జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్లు తెలియజేశాడు. ఇక వారం రోజులు క్రిందట ఒక ప్రాజెక్ట్‌ షూటింగ్‌ పని మీద విశాఖపట్నం, భీమవరం వెళ్లి తిరిగి వచ్చిన ఆయన అనారోగ్యం పాలైనట్లు వెల్లడించాడు.

ఈరోజు ఉదయం రాకేష్ మాస్టర్ కూతురు రిషికమ్మ, సాజిత్‌ కి ఫోన్ చేసి.. నాన్నగారి కాళ్లు, చేతులు పడిపోయాయని, పక్షవాతం అనిపిస్తుందని చెప్పిందట. ఆ కాల్ చేసిన కొద్దిసేపటికే ఆయన మరణవార్త వినాల్సి వచ్చిందని సాజిత్‌ చెప్పుకొచ్చాడు. ఈరోజు మధ్యాహ్నాం ఒంటిగంట సమయంలో గాంధీ ఆస్పత్రిలో చేరిన రాకేశ్ మాస్టర్.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో సాయంత్ర 5 గంటల సమయంలో మరణించినట్లు సమాచారం.

Dil Raju : దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా దిల్ రాజు..

రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫర్‌గా దాదాపు 1500 చిత్రాలకు పని చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రఫర్‌లుగా చలామణి అవుతున్న చెలామణీ అవుతున్న జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈయన శిష్యులే.