CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు

మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తా.పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు.పటాన్ చెరుకు ఐటీ కంపెనీలు.

CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు

CM KCR pathancheru Metro rail

CM KCR in pathancheru : సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతున్న క్రమంలో పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ పటాన్ చెరుపై వరాల జల్లు కురిపించారు. రూ.184.87 కోట్ల వ్యవయంతో 200 పడకల సూపర్ ఆస్పత్రి భవనానికి శంకుస్థాపన చేసుకున్నామని ఆస్పత్రి నిర్మాణం ఖర్చులో రాష్ట్ర వాటా 25 శాతం ఉంటుందని తెలిపారు. మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పటాన్ చెరుకు ఐటీ కంపెనీలు వచ్చేలా చూస్తాం అని హామీ ఇచ్చారు.

Ponguleti Srinivas Reddy : కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకే భట్టి పాదయాత్ర : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
అలాగే పటాన్ చెరుకు పాలిటెక్నీక్ కాలేజీని మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మూడు మిన్సిపాలీటీలకు రూ.30కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామ పంచాయితీకి రూ.15లక్షలు మంజూరు చేసి వాటిని విడుదల చేస్తామన్నారు. ఒకప్పుడు పటాన్ చెరులో కరెంట్ కోసం పరిశ్రమలు సమ్మె చేశాయని కానీ ఇప్పుడలా కాదు రోజుకు 24గంటలు కరెంట్ ఇస్తున్నాం దీంతో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని ఎట్టకేలకు సొంత రాష్ట్రం సాధించుకున్నామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతోమంది ఎన్నో అనుమానాలు వ్యక్తంచేశారు. తెలంగాణ చీకటి తెలంగాణ అంటూ ఎన్నో విమర్శలు చేశారు.కానీ ఈరోజు రోజుకు 24గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ -1గా ఉందన్నారు.

మోసపోతే గోస పడతాం..జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే మీరు కోరుకున్నవన్ని నెరవేరుతాయని అన్నారు.హైదరాబాద్ లో భూముల విలువ పెరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.

Koppula Eshwar : నాపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుడు ఆరోపణలు.. కోర్టు తీర్పు అనంతరం న్యాయపరమైన చర్యలు : మంత్రి కొప్పుల