Podu Land Pattas : ఫలించిన పోడు భూముల పోరాటం… అసిఫాబాద్ వేదికగా నేడు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ

కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు.

Podu Land Pattas : ఫలించిన పోడు భూముల పోరాటం… అసిఫాబాద్ వేదికగా నేడు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ

Podu land pattas

CM KCR Distribute : తెలంగాణలో అడవి బిడ్డల దశాబ్ధాల కల నెరవేరింది. పోడు భూములపై హక్కుల కోసం గిరిజనులు చేస్తున్న పోరాటం ఫలించింది. నేడు శుక్రవారం కొమురంభీం అసిఫాబాద్ జిల్లా వేదికగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆదివాసీ బిడ్డలకు ప్రభుత్వం పోడు పట్టాలు అందించనుంది. దశాబ్ధాలుగా తెలంగాణలో పోడు భూముల హక్కుల పోరు సాగుతోంది. తమ భూములపై హక్కుల కోసం అడవి బిడ్డలు పోరు చేస్తూనేవున్నారు. పోడు భూమిపై హక్కు కోసం గిరిజనులు, అవే భూముల కోసం అటవీ అధికారులు రంగంలోకి దిగడంతో దశాబ్ధాలుగా ఏజెన్సీలో అలజడికి కారణమైంది.

దీంతో ఎట్టకేలకు రాష్ట్రంలో పోడు భూములకు పరిష్కారం చేసే దిశగా కేసీఆర్ సర్కార్ ముందడుగు వేస్తోంది. పోడు పట్టాల కోసం ఎదురుచూస్తోన్న గిరిజనులకు పోడు పట్టాల పంపిణీకి సీఎం కేసీఆర్ ఇవాళ (శుక్రవారం) శ్రీకారం చుడుతున్నారు. పోడు పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీకి సిద్ధమైంది.మొదట జూన్ 24 ముహూర్తం పిక్స్ చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో నేషనల్ ఎలక్షన్ కమిషన్ పర్యటన కారణంగా పోడు పట్టాల పంపిణీని ఇవాళ్టికి వాయిదా వేసింది.

DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి

కొమురంభీ అసిఫాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీని ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలను గిరిజనులకు పంపిణీ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 6 వేల 369 ఎకరాల పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వనుంది. దీని ద్వారా లక్షా 51 వేల 146 మంది గిరిజనులు పోడు పట్టాలు అందుకోనున్నారు.

ఇక తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుకొని పాలమూరు జిల్లాలోని నల్లమల అడువుల పరిధిలో గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. అయితే వీరికి కాంగ్రెస్ హయాంలోని యూపీఏ-1 ప్రభుత్వం అటవీ భూముల హక్కు చట్టం-2006 కింద గిరిజనులకు తొలిసారిగా భూమి హక్కు పత్రాలు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల నుండి లక్షా 83 వేల 107 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Uttar Pradesh Road Accident : ఉత్తరప్రదేశ్ లో ట్రక్కును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం

93 వేల 494 మందికి 3 లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు అటవీ హక్కు చట్టం ప్రకారం.. గిరిజనులకు నాటి ప్రభుత్వం హక్కు పత్రాలు అందించింది. ఇలా నాటి నుంచి పెరుగుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు, గిరిజనేతరులు కలిపి 12 లక్షల 49 వేల ఎకరాల భూముల్లో సాగు చేసుకుంటున్నారు. వీటిపై హక్కుల కోసం 4లక్షల 14 వేల మంది అడవి బిడ్డలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనులకు ప్రభుత్వం.. రైతుబంధును కూడా వర్తింపచేయనుంది. ఇప్పటికే ఆర్వో ఎఫ్ ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితోపాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజనులతో జాబితాను రెడీ చేసింది. ఎట్టకేలకు తెలంగాణ దశాబ్ధి సంబురం వేళ తమ దశాబ్ధాల కల నెరవేరుతుండటంతో అడవి బిడ్డల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వనున్నారు.