Chandrababu Naidu: జగన్ మూర్ఖత్వానికి ఒక జాతి మొత్తం బలి అవ్వాలా? ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ కట్టలేదు

జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదని, భూముల సెటిల్మెంట్లుచేసి వేల కోట్లు సంపాదించాడు. రుషికొండను కొట్టేసి బొడిగుండు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా నాశనం అయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu: జగన్ మూర్ఖత్వానికి ఒక జాతి మొత్తం బలి అవ్వాలా? ఐదేళ్లలో ఒక్క బిల్డింగ్ కట్టలేదు

Chandrababu Naidu

TDP Chief Chandrababu : సీఎం జగన్ మోహన్ రెడ్డి మూర్ఖత్వం వల్ల ఏపీ ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి అనే కార్యక్రమం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు. అంతేకాక, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం.. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు. మా అమ్మ కష్టాలు నేను దగ్గర ఉండి చూశాను.. అందుకే గ్యాస్ సిలీండర్లు ఆనాడు తీసుకువచ్చామని, కట్టెల పోయి మీద మా అమ్మ పడిన కష్టాలు నేను ఎన్నో చూశా.. మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో అంతా ఇస్తామని చంద్రబాబు అన్నారు.

Chandrababu Naidu: అన్నం తినే వ్యక్తి జగన్‌కు ఓటేయడు.. అంతేకాదు..: చంద్రబాబు

ఆరోజు నేను టెక్నాలజీ అంటే నన్ను అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు అదే టెక్నాలజీ అందరికి ఉపయోగపడుతుంది. టీడీపీ అధికారంలోకి రాగానే యువత శక్తిని ఉపయోగించి వారిని ముందుకు నడిపిస్తాం. కీయా మోటార్స్ కేవలం క్రెడిబిలిటి వల్లనే వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లలో జగన్ ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు, దేశంలో ఎక్కడా లేని వనరులు ఏపీలోనే ఉన్నాయి. పట్టిసీమ కడితే ఆనాడు ఎగతాళి చేశారు, మరి ఈరోజు పట్టిసీమ లేకపోతే ఈ ప్రభుత్వం ఏమి చేసేది అని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పోలవరం నేడు జగన్ ముంచేశాడు.. పోలవరం పూర్తి అయితే దక్షిణ భారత దేశంలో ఏపీ నెంబర్ 1 అయ్యేది. జగన్ మూర్ఖత్వానికి ఒక జాతి మొత్తం బలి అవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

జగన్ లాంటి వాడిని నా జీవితంలో ఎప్పుడు చూడలేదని, భూముల సెటిల్మెంట్లుచేసి వేల కోట్లు సంపాదించారని చంద్రబాబు విమర్శించారు. రుషి కొండను కొట్టేసి బొడిగుండు చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ 2లో ఉంది. కౌలు రైతులు పూర్తిగా నాశనం అయ్యారంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.