Telangana Politics: అల్లుడికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా కేసీఆర్‭తో ఫైట్ ఆగదంటున్న సర్వే సత్యనారాయణ

ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు

Telangana Politics: అల్లుడికి బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చినా కేసీఆర్‭తో ఫైట్ ఆగదంటున్న సర్వే సత్యనారాయణ

Sarvey Sathyanarayana: తన అల్లుడు క్రిశాంక్‭కు భారత్ రాష్ట్ర సమితి నుంచి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‭తో తన ఫైట్ ఆగదని కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ తేల్చి చెప్పారు. అదే విధంగా పార్టీ మార్పు ఊహాగానాలపై ఆయన స్పందిస్తూ తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చాయని, అయితే తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల దృష్ట్యా శుక్రవారం మీడియాతో సర్వే చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Rahul Gandhi at Kargil: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింల పరిస్థితి మారుతుందా? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే?

‘‘రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పనున్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు చాలా స్పష్టతతో ఉన్నారు. రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీకి అధికారంతో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్రజలు రెడీగా ఉన్నారు’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నాకు ఇద్దరు తల్లులు.. ఒకరు నాకు జన్మనిచ్చిన తల్లి అయితే. మరొకరు రాజకీయ జన్మనిచ్చిన సోనియా గాంధీ. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. సమర్ధవంతమైన పాలనను దేశ ప్రజలకు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది’’ అని అన్నారు.

Governor Tamilisai: ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. పాల్గొన్న తమిళిసై, కేసీఆర్

ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే.. తన అల్లుడు క్రిశాంక్ టికెట్ ఆశిస్తున్న కంట్మోనెంట్ స్థానం నుంచే సర్వే కూడా టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే క్రిశాంక్ బీఆర్ఎస్ పార్టీలో ఉండగా, సర్వే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక తనను కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ వేటు వేయనున్నారన్న వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి షాకాజ్ నోటీసులు కానీ సస్పెన్షన్ లు కానీ లేవని అన్నారు. అయితే టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఇంచార్జీ కుంతీయ లాంటి వ్యక్తులను పదవుల నుంచి తొలగించే వరకు తాను పార్టీకి దూరంగా ఉంటానని అనుకున్నానని, అది జరిగినందుకే తిరిగి వచ్చానని సర్వే సత్యనారాయణ స్పష్టం చేశారు.