Nara Lokesh : జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, 20లక్షలు ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్

చంద్రబాబు కెపాసిటీ పోలవరం అయితే సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. Nara Lokesh - TDP

Nara Lokesh : జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, 20లక్షలు ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్

Nara Lokesh - TDP

Nara Lokesh – TDP : జగన్ పని అయిపోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు లోకేశ్. ఈసారి రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని లోకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బహిరంగసభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు.

” లోకేశ్ ను చూస్తే జగన్ ప్యాంటు తడుపుకుంటున్నాడు. రాజారెడ్డి రాజ్యాంగం చూసి మేము భయపడము. పాదయాత్ర జరుగుతున్న సమయంలో రెచ్చగొట్టేందుకు పోలీసులని పెడుతున్నారు. సహకరిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. మూడు రాజధానులు కడతానని చెప్పారు. కనీసం మూడు ఇటుకలు కూడా వెయ్యలేదు. విశాఖలో బస్టాండ్.. చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. చంద్రబాబు కెపాసిటీ పోలవరం అయితే సైకో జగన్ కెపాసిటీ మురికి కాలువ. వందసార్లు సైకో జగన్ వెంకన్న స్వామితో పెట్టుకున్నాడు. తిరుపతిలో అధిక ధరలు పెంచి దేవుడిని భక్తులకు దూరం చేశాడు. తిరుమలను రాజకీయ కొండగా మార్చేశాడు.

Also Read..Minister Roja: రోజాకు ఆ ఐదుగురితో విభేదాలు.. వారికి మంత్రి పెద్దిరెడ్డి అండదండలు!

మద్యం కుంభకోణం, బాబాయి హత్య కేసులో ఉన్న వారిని టీటీడీ పాలకమండలిలో పెట్టారు. జగన్ ని సొంత తల్లి, ఇద్దరు చెల్లులు నమ్ముతారా? వైఎస్ కుటుంబం మొత్తం జగన్ ని నమ్మడం లేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం జగన్ ని నమ్మడం లేదు. జగన్ రోజూ ఏమీ తాగుతున్నాడో తెలుసా? ప్రజల రక్తం. జే బ్రాండ్ లు తాగి ప్రజలు డయాలసిస్ తో బాధపడుతున్నారు. భారత దేశ చరిత్రలో 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. అధికారంలోకి వచ్చాక భూమ్ భూమ్, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో సొంత కంపెనీలు పెట్టి ప్రభుత్వ దుకాణాల్లో అమ్మిస్తారు.

Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు తుడిచేందుకు సంవత్సరానికి మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తాం” అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.