Talasani Srinivas : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరిగింది : మంత్రి తలసాని

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు.

Talasani Srinivas : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరిగింది : మంత్రి తలసాని

Talasani Srinivas Criticized Congress

Talasani Srinivas – Congress : తెలంగాణతో పోటీ పడే పరిస్థితి ఎవరికీ లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ ఎస్ మ్యానిఫెస్టో చూస్తే విపక్షాలకు దిమ్మ తిరిగిందని పేర్కొన్నారు. సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకుందన్నారు. సౌభాగ్య లక్ష్మీతో మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ఏది చెబితే అది చేసి చూపిస్తారని చెప్పారు. రైతు బీమా మాదిరిగానే ప్రజలకు బీమా ఇస్తామని తెలిపారు.

ఎన్నికల యుద్ధంలోకి పోతున్నాం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. మనం ఎన్నికల వరకే రాజకీయాలు మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబును 38 రోజులుగా జైల్లో పెట్టారు.. ఇలాంటి ఘటనలు చూస్తే భాద అనిపిస్తుందన్నారు. మనం ద్వేషం పెంచుకొవాల్సిన అవసరం లేదని తెలిపారు. గెలిచే సత్తా లేని పార్టీలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు చేయలేని కార్యక్రమాలు మనం చేశామని వెల్లడించారు.

కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు మనం చూస్తున్నామని, చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రధాని మోదీ రాష్టానికి వస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా నియోజకవర్గానికి ఏమి చేశారని నిలదీశారు. ఎప్పుడైనా నియోజకవర్గంలో కనిపించారా అని ప్రశ్నించారు.

ఎంపీ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఏనాడైనా ప్రజలకు అందుబాటులో ఉన్నారా? నిలదీశారు. ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సోనియా, రాహుల్ లకే దిక్కు లేదని.. కాంగ్రెస్ 6 గ్యారంటీ లు అంటున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో ఇవే పథకాలు చెప్పారు.. ఇప్పుడు చేతులు ఎత్తేశారని పేర్కొన్నారు.