ODI World Cup 2023 : విరాట్ కోహ్లీ సెంచ‌రీకి అంపైర్ సాయం చేశాడా..? అది వైడా..? కాదా..?

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ వ‌న్డేల్లో 48వ శ‌త‌కాన్ని అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పూణే వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌ల‌తో 103 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

ODI World Cup 2023 : విరాట్ కోహ్లీ సెంచ‌రీకి అంపైర్ సాయం చేశాడా..? అది వైడా..?  కాదా..?

Umpire refuses to signal wide

Virat Kohli’s 48th Century Update: : ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. వ‌న్డేల్లో 48వ శ‌త‌కాన్ని అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పూణే వేదిక‌గా బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌ల‌తో 103 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కోహ్లీ సూప‌ర్ శ‌త‌కంతో బంగ్లా పై భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా నాలుగో విజ‌యాన్ని భార‌త్ సొంతం చేసుకుంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచ‌రీ చేయ‌డం ఓ న‌మ్మ‌శ‌క్యం కాని విష‌యం. ఎందుకంటే విరాట్ కోహ్లీ 74 ప‌రుగుల వ‌ద్ద ఉన్న‌ప్పుడు భార‌త విజ‌యానికి 27 ప‌రుగులు అవ‌స‌రం. ఆ స‌మ‌యంలో కోహ్లీ సెంచ‌రీ చేస్తాడ‌ని ఎవ్వ‌రూ కూడా ఊహించి ఉండ‌రు. అయితే.. నాన్ స్ట్రైక్‌లో ఉన్న కేఎల్ రాహుల్ ప్రోత్సాహంతో విరాట్ కోహ్లీ శ‌త‌కాన్ని అందుకున్నాడు.

కోహ్లీ శ‌త‌కాన్ని అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన బంగ్లా..!

41 ఓవర్లు ముగిసే సరికి విరాట్ కోహ్లీ 97 ప‌రుగుల‌తో ఉన్నాడు. టీమ్ఇండియా విజ‌యానికి రెండు ప‌రుగులే అవ‌స‌రం. 42వ ఓవర్ ను బంగ్లా బౌల‌ర్ న‌సుమ్ అహ్మ‌ద్ వేశాడు. కావాల‌ని వేశాడో అలా వెళ్లిందో తెలియ‌దు గానీ బంతిని లెగ్ సైడ్ దిశ‌గా వేశాడు. అంపైర్ దీన్ని వైడ్ గా ప్ర‌క‌టిస్తాడా..? లేదా..? అని విరాట్ కోహ్లీ అంపైర్ వైపు చూశాడు. అయితే.. బంతిన వేసిన‌ప్పుడు కోహ్లీ కాస్త లోప‌లికి జ‌రిగాడ‌ని భావించిన అంపైర్ కెటిల్‌బ‌రో వైడ్ ఇవ్వలేదు. దీంతో కోహ్లీతో పాటు అభిమానులు ఊర‌ట చెందారు. మూడో బంతికి సిక్స్ కొట్టి కోహ్లీ శ‌త‌కాన్ని అందుకున్నాడు.

Hardik Pandya : హార్దిక్ పాండ్య గాయంపై బీసీసీఐ అప్‌డేట్‌.. బిగ్ షాక్‌..

అంపైర్ పై విమ‌ర్శ‌లు..!

అంపైర్ కెటిల్ బ‌రో నిర్ణ‌యం పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ‌నే న‌డుస్తోంది. కొంద‌రు అత‌డి నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తుండ‌గా మ‌రికొంద‌రు మాత్రం త‌ప్ప‌ని అంటున్నారు. ఏ త‌ర‌హా క్రికెట్‌లో అయినా స‌రే ఆ బంతిని వైడ్‌గానే ప్ర‌క‌టిస్తారు అని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఐసీసీ స్పందించాల‌ని కోరుతున్నారు. కోహ్లీ శ‌త‌కం చేసేందుకు అంపైర్ కెటిల్ బ‌రో ప‌రోక్షంగా సాయం చేశాడ‌ని అంటున్నారు.