Bigg Boss 7 : ప్రియాంక కోసం ప్రియుడు బిగ్‌బాస్‌ ఎంట్రీ.. హౌస్‌లోనే పెళ్లి చేసుకుందామంటూ..

ప్రియాంక కోసం బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియుడు. ఇక హౌస్ లో ఉన్నంత సేపు ఇద్దరు ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు.

Bigg Boss 7 : ప్రియాంక కోసం ప్రియుడు బిగ్‌బాస్‌ ఎంట్రీ.. హౌస్‌లోనే పెళ్లి చేసుకుందామంటూ..

Telugu BiggBoss season 7 new episode promos gone viral

Bigg Boss 7 : తెలుగు బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ స్టార్ట్ అయ్యి అంతా ఉల్టా పల్టా గానే సాగుతుంది. ఎప్పుడు బిగ్‌బాస్ చివరిలో హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మధ్యలోని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సడన్ సర్‌ప్రైజ్ లు ఇస్తున్నారు. నిన్న కంటెస్టెంట్స్ శివాజీ, అర్జున్, అశ్విని కుటుంబసభ్యులు ఎంట్రీ ఇచ్చి హౌస్ ని ఎమోషనల్ గా మార్చేశారు. ఇక ఇవాళ్టి ఎపిసోడ్ లో ప్రియాంక, గౌతమ్ కి చెందిన వారు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోలను నిర్వాహకులు రిలీజ్ చేశారు.

ప్రియాంక ప్రియుడు ‘శివకుమార్ మరియాల్’ ని హౌస్ లోకి తీసుకు వచ్చారు. శివకుమార్ కూడా సీరియల్స్ నటిస్తూ వస్తున్నాడు. వీరిద్దరూ కలిసి ‘మౌనరాగం’ అనే సీరియల్ కలిసి నటించారు. సీరియల్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు సమాచారం. ఇక శివ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ప్రియాంక కౌగిలింతతో ప్రియుడికి ఆహ్వానం పలికింది. ఆ తరువాత హౌస్ లో ఉన్నంత సేపు ఇద్దరు ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇక హౌస్ నుంచి బయటకి వెళ్లే సమయం వచ్చినప్పుడు.. శివ, ప్రియాంకతో బయటకి రాగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. దానికి ప్రియాంక బదులిస్తూ.. ఇక్కడే పెళ్లి చేసుకుందాం అని రిప్లై ఇచ్చింది.

Also read : Rana Daggubati : ఆ పని చేసినందుకు నాన్నతో గొడవ.. ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం..

అలాగే గౌతమ్ తల్లి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు హౌస్ లోకి ఒక పట్టుపంచ వచ్చింది. అది ఎవరి కోసమో తెలియక పక్కన పెట్టేశారు. అయితే హౌస్ లో గౌతమ్ మదర్ ఎంట్రీ ఇచ్చే ముందు.. కన్నయ్య పంచ వచ్చిందా అని వాయిస్ వినిపించింది. దీంతో గౌతమ్ వెంటనే వెళ్లి ఆ పంచ కట్టుకున్నాడు. ఆ తరువాత గౌతమ్ తల్లి ఎంట్రీ ఇవ్వడం, ఆమె తన ప్రేమని గౌతమ్ కి మాత్రమే కాకుండా ప్రిన్స్ యావర్ కి కూడా పంచడంతో.. ప్రిన్స్ ఎమోషనల్ అయ్యాడు.