Rachin Ravindra: రచిన్ రవీంద్ర వీడియా వైరల్.. ఇంతకీ ఏముంది అందులో?

న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rachin Ravindra: రచిన్ రవీంద్ర వీడియా వైరల్.. ఇంతకీ ఏముంది అందులో?

Rachin Ravindra getting love at grandparents home in Bengaluru

Rachin Ravindra Viral Video: రచిన్ రవీంద్ర.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు ఇప్పుడు చిరపరిచితం. తాజా వన్డే వరల్డ్ కప్ లో సత్తా చాటి తానేంటో నిరూపించుకున్నాడు. తాను ఆడుతున్న మొదటి ప్రపంచకప్ లోనే తన ఆటతో అందరినీ ఇంప్రెస్ చేశాడు. భారత సంతతి చెందినవాడైనప్పటికీ న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు. అత్యధిక పరుగులతో టాప్ లో నిలిచి ఔరా అనిపించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి హేమహేమీల సరసన చోటు సంపాదించాడు. ఈ ప్రపంచకప్ లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో 565 పరుగులు చేసి అందరి కంటే ముందు నిలిచాడు. డికాక్(550), కోహ్లి(543), వార్నర్(446), రోహిత్ శర్మ(442) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

తన ఫస్ట్ వరల్డ్ కప్ లోనే న్యూజిలాండ్ టీమ్ లో కీలక సభ్యుడిగా మారిపోయాడు ఈ 23 ఏళ్ల యువ ఆల్ రౌండర్. బ్యాటర్ గా పలు రికార్డులు క్రియేట్ చేశాడు. వరల్డ్ కప్ లో 3 సెంచరీలు చేసిన డెబ్యూ ప్లేయర్ గా చరిత్ర లిఖించాడు. తన తండ్రి ఊరైన బెంగళూరులోనే ఈ రికార్డు సృష్టించడం విశేషం. నవంబర్ 4న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అతడీ అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ తరఫున ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా నమోదు చేశాడు. మరో 14 పరుగులు చేస్తే ఇంకో రికార్డు సొంతమవుతుంది. ఒక ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన కివీస్ బ్యాటర్ గా ఖ్యాతికెక్కుతాడు. 2019 వరల్డ్ కప్ లో కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేశాడు. కేన్ రికార్డును రచిన్ అధిగమిస్తాడో, లేదో చూడాలి.

Also Read: చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలతో కొత్త రికార్డ్

బామ్మ దిష్టి.. బుద్ధిగా కూచున్న రచిన్
తాజాగా రచిన్ రవీంద్రకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ మారింది. బెంగళూరులోని నివాసంలో అతడి బామ్మ దిష్టితీస్తున్న వీడియో బయటకు వచ్చింది. బామ్మ దిష్టి తీస్తుంటే బుద్ధిగా కూచున్నాడు రచిన్. ఈ వీడియో చూసిన వారంతా అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూలాలు మరిచిపోకుండా విశ్వాసాలను గౌరవిస్తున్నాడని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు పెద్దల పట్ల అతడు చూపిస్తున్న గౌరవానికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయినా.. బామ్మకు మనవడే కదా అని కమెంట్ చేస్తున్నారు. కాగా, న్యూజిలాండ్ తన తర్వాతి మ్యాచ్ భారత్ తో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొదటి సైమీఫైనల్లో ఈ రెండు జట్లు తలపడే చాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర ఎలా ఆడతాడోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.