Pakistan : పాకిస్థాన్ టీమ్ పై సెహ్వాగ్ సెటైర్లు.. దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యుంటాదిగా..!

Pakistan -Virender Sehwag : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది.

Pakistan : పాకిస్థాన్ టీమ్ పై  సెహ్వాగ్ సెటైర్లు.. దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అయ్యుంటాదిగా..!

Pakistan

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. లీగ్ ద‌శ‌లో న్యూజిలాండ్‌, శ్రీలంక‌లు అన్ని మ్యాచులు ఆడేయ‌గా మిగిలిన జ‌ట్లు ఒక్కొ మ్యాచ్ ఆడాల్సి ఉంది. టీమ్ఇండియా, ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ సెమీస్ బెర్తుల‌ను ఖ‌రారు చేసుకున్నాయి. నాలుగో స్థానంలో న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్ చేరుకోవ‌డం లాంఛ‌న‌మే. ఆఖ‌రి మ్యాచుల్లో పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్లు ఏదైన మ‌హా అద్భుతాన్ని చేస్తే మిన‌హా కివీస్ సెమీస్ చేర‌డం ఖాయం.

పాకిస్తాన్ త‌న ఆఖ‌రి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొద‌ట బ్యాటింగ్ చేస్తే 287 ప‌రుగుల భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది. అంటే తొలుత పాక్ బ్యాటింగ్ చేసి ఓ 300 ప‌రుగులు చేస్తే.. ఇంగ్లాండ్‌ను 13 ప‌రుగుల‌కే ఆలౌట్ చేయాలి. అలా కాకుండా ల‌క్ష్య ఛేద‌న‌కు దిగితే ఇంగ్లాండ్ చేసే స్కోరును ఐదు నుంచి ఆరు ఓవ‌ర్ల లోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇలా జ‌ర‌గ‌డం అనేది దాదాపుగా సాధ్యం అయ్యే ప‌ని కాదు. కాబ‌ట్టి పాకిస్థాన్ సెమీస్ చేరే దారులు మూసుకుపోయిన‌ట్లే.

Henry Nicholls : ఓ వైపు న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌కు స‌న్న‌ద్ధం అవుతుండ‌గా.. మ‌రోవైపు కివీస్ ఆట‌గాడిగాపై బాల్ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌లు

బై బై పాకిస్తాన్.. సేఫ్ ఫ్లైట్ జర్నీ..

Virender Sehwag

Virender Sehwag

ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవ‌రెట్ల‌లో ఒక‌టైన పాకిస్థాన్ క‌నీసం సెమీస్‌కు చేర‌కుండానే ఇంటి ముఖం ప‌ట్ట‌బోతుండ‌డంతో ఆ జ‌ట్టు మాజీ ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఈ మెగాటోర్నీలో పాక్ ఎలాంటి వ్యూహాలు లేకుండా ఆడిందంటూ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Rachin Ravindra: రచిన్ రవీంద్ర వీడియా వైరల్.. ఇంతకీ ఏముంది అందులో?

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ ఉండే వీరేంద్ర సెహ్వాగ్ త‌న దైన శైలిలో పాకిస్థాన్‌కు గ‌ట్టి పంచ్ ఇచ్చాడు. పాకిస్థాన్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ త‌నదైన శైలిలో సెటైర్లు వేశాడు. బై బై పాకిస్థాన్ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. పాక్ టీమ్‌కు గుడ్ బై చెప్పాడు. సేఫ్ ఫ్లైట్ జర్నీ టు పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేశాడు. సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.