PM Modi : కన్హా శాంతివనంకు ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

కన్హా శాంతివనంకు ప్రధాని వెళ్తున్నవేళ అసలు కన్హా శాంతి వనం అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు.

PM Modi : కన్హా శాంతివనంకు ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..

Kanha Shanti Vanam

Visit Kanha Shanti Vanam : ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. శనివారం పలు నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభలు, రోడ్ షోలలో బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రధాని ప్రచారం చేశారు. రెండోరోజు ఆదివారం పలు ప్రాంతాల్లో ప్రధాని మోదీ ప్రచారం కొనసాగుతోంది. అయితే, ఉదయం వేళ మోదీ కన్హా శాంతి వనాన్ని సందర్శిస్తారు. ఉదయం 11.25 గంటలకు శాంతి వనానికి మోదీ వెళ్తారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు మోదీ అక్కడే ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ కన్హా శాంతివనంలో సుమారు గంటన్నర పాటు ప్రధాని మోదీ ధ్యానం చేస్తారు.

Also Read : Chandrababu Naidu : రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. 28న బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ

కన్హా శాంతివనంకు ప్రధాని వెళ్తున్నవేళ అసలు కన్హా శాంతి వనం అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏమిటి అనే విషయాలపై ప్రజలు ఆరా తీస్తున్నారు. కన్హా శాంతివనం హైదరాబాద్ లోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న చేగూరు ప్రాంతంలో ఉంది. ఆదివారం అక్కడకు వెళ్లనున్న ప్రధాని మోదీ వందలాది మందితో కలిసి ధ్యానం చేయనున్నారు. కన్హా శాంతివనకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకునేలా హాల్ ఉంటుంది. ఒక పెద్ద ధ్యాన కేంద్రంతో పాటు దానిచుట్టూ ఎనిమిది ఉప కేంద్రాలను తాబేలు ఆకారంలో నిర్మించారు. మెడిటేషన్ హాల్ చుట్టూ చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేశారు. వేడిని తగ్గించేందుకు డోమ్ తరహా శాటిలైట్ నిర్మాణం కలిగి ఉంది.

ఇదిలాఉంటే.. ప్రధాని రాక సందర్భంగా శాంతివనం, పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన ప్రతీవారికి అన్ని సౌకర్యాలు నిర్వాహకులు కల్పించనున్నారు. ఉదయం టిఫిన్, భోజనం, వసతి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయని నిర్వాహకులుతెలిపారు.