Kavya Maran : చాలా త‌క్కువ‌కు స్టార్ ప్లేయ‌ర్‌ను సొంతం చేసుకోగానే కావ్య మారన్ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌.. ఎవ‌రో తెలుసా..?

ఐపీఎల్ మినీ వేలంలో ఎస్ఆర్‌హెచ్ య‌జ‌మాని క‌ళానిధి మార‌న్ కూతురు అయిన కావ్య మార‌న్ పాల్గొంది.

Kavya Maran : చాలా త‌క్కువ‌కు స్టార్ ప్లేయ‌ర్‌ను సొంతం చేసుకోగానే కావ్య మారన్ ఇచ్చిన రియాక్ష‌న్ వైర‌ల్‌.. ఎవ‌రో తెలుసా..?

Kavya Maran

Kavya Maran Reaction : ఐపీఎల్ 2024 సీజ‌న్ ముందు దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదిక‌గా మినీ వేలం జ‌రిగింది. మొద‌టి ఆట‌గాడిగా వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ రోవ్‌మ‌న్ పావెల్ వేలంలోకి వ‌చ్చాడు. రూ.కోటి బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన అత‌డి కోసం కోల్‌క‌తా, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు రాజ‌స్థాన్ రూ.7.40 కోట్ల‌కు ద‌క్కించుకుంది. ఆ త‌రువాత రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వ‌చ్చిన హ్యారీ బ్రూక్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ రూ.4కోట్ల‌కు ద‌క్కించుకుంది.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆస్ట్రేలియా గెలుచుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించిన ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వ‌చ్చాడు. అత‌డిని ద‌క్కించుకునేందుకు చెన్నై, స‌న్‌రైజ‌ర్స్ తీవ్రంగా పోటీప‌డ్డాయి. చివ‌ర‌కు రూ.6.80 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ద‌క్కించుకుంది.

Mitchell Starc : క‌మిన్స్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన స్టార్క్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌.. ఎంతో తెలుసా..?

కావ్య మారన్ రియాక్ష‌న్..

ఆత‌రువాత శ్రీలంక ఆల్‌రౌండ‌ర్ వానింద్ హ‌స‌రంగా వేలంలోకి వ‌చ్చాడు. అత‌డి బేస్ ప్రైజ్ రూ.కోటి కాగా.. రూ.1.5 కోట్ల‌కే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ అత‌డిని కొనుగోలు చేసింది.

కాగా.. ఈ వేలానికి ఎస్ఆర్‌హెచ్ య‌జ‌మాని మార‌న్ కూతురు అయిన కావ్య మార‌న్ హాజ‌రైంది. వ‌నిందు హ‌స‌రంగ కోసం మొద‌ట చెన్నై బేస్ ప్రైజ్ వ‌ద్దే బిడ్ వేయ‌గా ఆ త‌రువాత హైద‌రాబాద్ బిడ్ వేసింది. చెన్నై వెన‌క్కి త‌గ్గ‌డంతో రూ.1.5 కోట్ల‌కే హ‌స‌రంగాను ఎస్ఆర్‌హెచ్‌ ద‌క్కించుకుంది.

ఆ స‌మ‌యంలో అంత త‌క్కువ మొత్తానికి హ‌స‌రంగ ద‌క్క‌డంతో కావ్య మార‌న్ ఇచ్చిన ఎక్స్ ప్రెష‌న్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Daryl Mitchell : గ‌తేడాది అమ్ముడుపోలేదు.. ఇప్పుడేమో ఏకంగా రూ.14 కోట్లు.. డారిల్ మిచెల్‌పై క‌న‌క‌వ‌ర్షం..