బీజేపీ నుంచి క్లారిటీ రాకుంటే ఈ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసే ఆలోచనలో టీడీపీ-జనసేన

ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానంతో చర్చించాలని పవన్ కల్యాణ్ భావించారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు.

బీజేపీ నుంచి క్లారిటీ రాకుంటే ఈ సీట్లలో అభ్యర్థులను ప్రకటించేసే ఆలోచనలో టీడీపీ-జనసేన

BJP TDP JanaSena

టీడీపీ – జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు కొనసాగుతోంది. బీజేపీ విషయంలో క్లారిటీ రాకుంటే తమ వరకు చేసుకున్న సీట్ల సర్దుబాట్లకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే ఆలోచనలో టీడీపీ-జనసేన ఉంది. బీజేపీతో పొత్తు అంశంపై క్లారిటీ లేకపోవడంతో ప్రక్రియ ఆలస్యం అవుతోందని టీడీపీ-జనసేన వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్ఠానంతో చర్చించాలని పవన్ కల్యాణ్ భావించారు. బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాకపోవడంతో అమరావతికి తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రక్రియ ఆలస్యం కావడంతో టెన్షన్ లో ఉన్నారు టీడీపీ-జనసేన ఆశావహులు. ఇంకా జాప్యం చేస్తే నష్టం జరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలో రెండు పార్టీల అధిష్ఠానాలు ఉన్నాయి.

మరికొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయాలు తీసుకుంది. బీజేపీ ఇప్పటివరకు ఎటూ తేల్చకపోవడంతో జనసేన-టీడీపీ లిస్ట్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. నాలుగో తేదీన అనాకపల్లిలో పవన్ బహిరంగ సభ ఉండబోదని జనసేన అంటోంది.

MLA Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు..