Sarfaraz Khan : సూర్య వ‌ల్లే ఇదంతా.. అలా మెసేజ్ చేసి ఉండ‌క‌పోతే.. స‌ర్ఫ‌రాజ్ తండ్రి

సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత ఎట్టకేల‌కు యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు.

Sarfaraz Khan : సూర్య వ‌ల్లే ఇదంతా.. అలా మెసేజ్ చేసి ఉండ‌క‌పోతే.. స‌ర్ఫ‌రాజ్ తండ్రి

Suryakumar Message Convinced Sarfaraz father To Attend Son's Debut

Sarfaraz Khan – Naushad Khan : సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత ఎట్టకేల‌కు యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ఇండియా త‌రుపున బ‌రిలోకి దిగాడు. కాగా.. మ్యాచ్ ఆరంభానికి ముందు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ కుటుంబ స‌భ్యులు భావోద్వేగానికి గుర‌య్యారు. దిగ్గ‌జ ఆట‌గాడు అనిల్‌కుంబ్లే చేతుల మీదుగా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ అరంగ్రేట క్యాప్‌ను అందుకున్నాడు.

ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న స‌ర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌష‌ద్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. క్యాప్ అందుకున్న అనంత‌రం స‌ర్ఫ‌రాజ్ అత‌డి తండ్రి వ‌ద్ద‌కు వ‌చ్చాడు. తండ్రిని కౌగిలించుకుని ఆనందాన్ని పంచుకున్నాడు. అత‌డి క్యాప్‌ను తీసుకుని నౌష‌ద్ ముద్దాడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Dhruv Jurel : నాకే బౌన్స‌ర్ వేస్తావా.. అరంగ్రేట ఆట‌గాడు ధ్రువ్ జురెల్ దెబ్బ‌కు బిత్త‌ర‌పోయిన ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు

అయితే.. తాను మైదానానికి రావాల‌ని అనుకోలేద‌ని, సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌ల్లే వ‌చ్చాడ‌ని నౌష‌ద్ ఖాన్ తెలిపాడు. తాను మ్యాచ్‌కు వ‌స్తే స‌ర్ఫ‌రాజ్ ఒత్తిడికి లోన‌వుతాడ‌ని భావించిన‌ట్లు చెప్పాడు. అదే స‌మ‌యంలో త‌న ఒంట్లో కాస్త న‌ల‌త‌గా ఉంద‌న్నాడు. కానీ సూర్య‌కుమార్ యాద‌వ్ పంపించిన మెసేజ్ చూసిన త‌రువాత ఇంట్లో ఉండ‌లేక‌పోయాన‌న్నాడు. జీవితంలో ఇలాంటి క్ష‌ణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని, ఒక్క‌సారి మాత్ర‌మే వ‌స్తాయ‌ని సూర్య అన్నాడు.

తాను టెస్టుల్లో అరంగ్రేటం చేసిన స‌మ‌యంలో అమ్మానాన్న త‌న వెన‌కే ఉన్నారని, ఆ క్ష‌ణం ఎంతో ప్ర‌త్యేకం అని చెప్పాడు. అందుకే మీరు మ్యాచ్‌కు వెళ్తే బాగుంద‌ని అని సూర్య స‌ల‌హా ఇచ్చాడు. దాన్ని చూసిన త‌రువాత ఆగ‌లేక‌పోయాను. ముంబైలో ఉన్న తాను వెంట‌నే రాజ్‌కోట్‌కు బ‌య‌లుదేరి వ‌చ్చిన‌ట్లు నౌష‌ద్ చెప్పాడు.

Anil Kumble : నా దురదృష్టం సర్ఫరాజ్ ఖాన్‌కు అంటుకున్న‌ట్లుంది.. అనిల్ కుంబ్లే వ్యాఖ్య‌లు వైర‌ల్‌

ఈ మ్యాచ్‌లో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ 66 బంతులు ఎదురొని 62 ప‌రుగులు చేశాడు. అయితే.. దుర‌దృష్ట‌వ‌శాత్తు అత‌డు ర‌నౌట్ అయ్యాడు. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా త‌ప్పిదం కార‌ణంగానే అత‌డు పెవిలియ‌న్‌కు చేరుకోవాల్సి వ‌చ్చింది.