శ‌త‌క్కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. సెంచ‌రీ నంబ‌ర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్‌..

టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు.

శ‌త‌క్కొట్టిన రోహిత్ శ‌ర్మ‌.. సెంచ‌రీ నంబ‌ర్ 48.. జోరూట్ రికార్డ్ బ్రేక్‌..

Rohit Sharma 12th Test ton

Rohit Sharma 12th Test ton : టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో అత‌డు 154 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో సెంచ‌రీ సాధించాడు. ఈ సిరీస్‌లో అత‌డికి ఇది రెండో సెంచ‌రీ కాగా.. టెస్టు క్రికెట్‌లో 12వ శ‌త‌కం. ఇక ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో(మూడు ఫార్మాట్ల‌లో) 48వ సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలో అత‌డు జోరూట్ రికార్డును బ్రేక్ చేయ‌గా టీమ్ ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్ శ‌త‌కాల రికార్డును స‌మం చేశాడు.

అంత‌ర్జాయ క్రికెట్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు జోరూట్ 47 శ‌త‌కాలు చేశాడు. తాజా శ‌త‌కంతో రోహిత్.. రూట్‌ను అధిగ‌మించాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ 48 సెంచ‌రీల రికార్డును రోహిత్ స‌మం చేశాడు. కాగా.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీల రికార్డు క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ త‌న కెరీర్‌లో 100 సెంచ‌రీలు బాదాడు. ఆ త‌రువాత స్థానంలో ప‌రుగుల యంత్రం రికార్డు రారాజు విరాట్ కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్పటి వ‌ర‌కు 80 సెంచ‌రీలు చేశాడు.

Shubman Gill : గిల్ బాబు.. అండ‌ర్స‌న్‌ను గ‌ల్లీ బౌల‌ర్ అనుకున్నావా ఏంటీ..? ఆ కొట్టుడు ఏందీ? బెన్‌స్టోక్స్ ప్ర‌శంస‌లు

ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే.. మూడు ఫార్మాట్ల‌లో 472 మ్యాచ్‌లు ఆడాడు. 498 ఇన్నింగ్స్‌ల్లో 43.45 స‌గ‌టుతో 18,815 ప‌రుగులు చేశాడు. ఇందులో 48 సెంచ‌రీలు, 102 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. వ‌న్డేల్లో 262 మ్యాచులు ఆడాడు. 254 ఇన్నింగ్స్‌ల్లో 49.12 స‌గ‌టుతో 10,709 ప‌రుగులు చేశాడు. ఇందులో 31 శ‌త‌కాలు, 55 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 151 టీ20లు ఆడాడు. 140 ఇన్నింగ్స్‌ల్లో 31.79 స‌గ‌టుతో 3974 ప‌రుగులు చేశాడు. ఇందులో 5 సెంచ‌రీలు, 29 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. సుదీర్ఘ ఫార్మాట్ విష‌యానికి వ‌స్తే.. 59 టెస్టులు ఆడాడు. 101 ఇన్నింగ్స్‌ల్లో 45.97 స‌గ‌టుతో 4137 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 18 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భార‌త బ్యాట‌ర్లు..
సచిన్ టెండూల్కర్ – 100 శ‌త‌కాలు
విరాట్ కోహ్లీ – 80 శ‌త‌కాలు
రాహుల్ ద్రవిడ్ – 48 శ‌త‌కాలు
రోహిత్ శర్మ – 48 శ‌త‌కాలు
వీరేంద్ర సెహ్వాగ్ – 38 శ‌త‌కాలు
సౌరవ్ గంగూలీ – 38 శ‌త‌కాలు

Sachin Tendulkar : బిగ్‌బాస్ విన్న‌ర్ చేతిలో ఔటైన స‌చిన్ టెండూల్క‌ర్‌.. వీడియో వైర‌ల్‌

ఇక ధ‌ర్మ‌శాల టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రెండో రోజు లంచ్ విరామానికి భార‌త్ వికెట్ న‌ష్ట‌పోయి 264 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (102), శుభ్‌మ‌న్ గిల్ (101) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ప్ర‌స్తుతం భార‌త్ 46 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.