రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్థలం ఇదే.. వీడియో వైరల్

రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

రామోజీరావు అంత్యక్రియలు జరిగే స్థలం ఇదే.. వీడియో వైరల్

Ramoji Rao Funeral

Ramoji Rao Funeral Updates : రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రామోజీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగే స్మృతివనం ప్రాంతానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read : Telugu Film Chamber : రామోజీరావు మృతికి టాలీవుడ్‌ నివాళి.. రేపు సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్ణయం

రామోజీరావు బంతికున్న సమయంలోనే ఫిల్మ్ సిటీలో స్మృతివనాన్ని నిర్మించుకోవటం జరిగింది. నాకు మరణం అంటే భయం లేదని పలు సందర్భాల్లో రామోజీరావు చెప్పారు. దానికి అనుగుణంగానే ఆయన బతికుండగానే స్మృతి వనాన్ని నిర్మించుకొని నా అంత్యక్రియలు ఇక్కడే చేయాలని ముందుగానే చెప్పారని రామోజీ సన్నిహితులు చెబుతున్నారు. రామోజీ కోరిక మేరకు స్మృతివనం వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రేపు జరిగే అంత్యక్రియలకు తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు, ఆయనకు సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గోనున్నట్లు తెలుస్తోంది. రామోజీ మనవడు యూఎస్ నుంచి రావాల్సి ఉంది. అతను వచ్చిన తరువాత ఏ సమయానికి ఏ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనే విషయాన్ని చెబుతామని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే రామోజీ కుటుంబంలో ఎవరు మరణించినా ఈ ప్రాంతంలోనే అంత్యక్రియలు జరిగాయి.

Also Read : ఎవరీ ఐశ్వర్య మీనన్..! మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెను ఎందుకు ఆహ్వానించారో తెలుసా?

రామోజీరావు మృతి ప‌ట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ సంతాపం వ్య‌క్తం చేసింది. సంతాప సూచిక‌గా రేపు (ఆదివారం జూన్ 9న‌) సినిమా షూటింగ్‌ల‌ను నిలిపివేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆదివారం షూటింగ్ లను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.