SSMB 29 : మొన్న ప్రభాస్తో.. ఇప్పుడు మహేష్ బాబుతో.. రాజమౌళి సినిమాలో ఆ మలయాళం స్టార్ హీరో నిజమేనా?
రాజమౌళి - మహేష్ బాబు నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు.
SSMB 29 : మహేష్ బాబు – రాజమౌళి సినిమా గురించి రోజు ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. ఈ సినిమా నుంచి అధికారికంగా ఏ ప్రకటన రాకపోయినా ఎవరో ఒకరు ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నాయని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని, మహేష్ కూడా తన పాత్రకు తగ్గట్టు బాడీ బిల్డ్ చేస్తున్నట్టు పలువురు ఇప్పటివరకు ఇంటర్వ్యూలలో తెలిపారు.
అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు వీళ్ళే అని అనేకమంది పేర్లు వినిపించాయి కానీ ఎవరి గురించి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా మరో పేరు వినిపిస్తుంది. మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ రాజమౌళి – మహేష్ బాబు సినిమాలో విలన్ పాత్ర పోషిస్తాడని వార్తలు వస్తున్నాయి. పృథ్విరాజ్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. ఇటీవల సలార్ సినిమాలో ప్రభాస్ తో నటించి ప్రేక్షకులకు మరింత పరిచయం అయ్యాడు.
Also Read : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త అవతారమెత్తనున్నాడా?
దీంతో పృథ్విరాజ్ సుకుమారన్ ఈసారి మహేష్ బాబుకి విలన్ గా నటించి మెప్పిస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక మహేష్ – రాజమౌళి సినిమా అడ్వెంచరస్ యాక్షన్ అని గతంలో రాజమౌళి తెలిపారు. ఈ సినిమా సెప్టెంబర్ లో మొదలవచ్చు అని తెలుస్తుంది.