సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం.

సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్

Sita Rama Lift Irrigation Project : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. మూడు పంపు హౌస్ లకు గాను ఇవాళ రెండు పంప్ హౌస్ లను ట్రయల్ రన్ పూర్తైంది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తైతే 10లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 3 జిల్లాల రైతులకు మేలు జరగనుంది. ఈ ప్రాజెక్ట్ తో గోదావరి, కృష్ణ నీళ్ల అనుసంధానం కానుంది. ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ లను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి కానున్న తొలి ప్రాజెక్ట్ ఇదే.

ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం. భదాద్రి జిల్లా అశ్వాపురం మండలం అయ్యగారి పల్లి వద్ద ఈ ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతోంది. గోదావరిలో ఆనాడు సర్ అర్ధర్ కాటన్ దుమ్ముగూడెం టెయిల్ పాండ్ నిర్మాణం చేపట్టారు. ఈ టెయిల్ పాండ్ నిర్మాణం వద్ద ఎప్పుడూ సమృద్ధిగా నీరు నిల్వ ఉంటుంది.

Also Read : తుంగభద్ర డ్యామ్ గేటు ధ్వంసం ఆందోళనకరం- ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు