మా అల్లుడు నాకంటే నటుడు అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తుకొస్తున్నాయి- సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు

జగన్ పై విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం.

మా అల్లుడు నాకంటే నటుడు అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తుకొస్తున్నాయి- సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు

Amabati Rambabu : పోలవరం ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి చేయటానికి రూ.12,157 కోట్లు ఇవ్వడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అవాస్తవాలు, అభూత కల్పనలు చెప్పారని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు మొదటి దశ కోసం అప్పటి కేంద్ర మంత్రులతో చర్చించి ఒప్పించే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు. చంద్రబాబును చూసి వెంటనే ఈ నిధులు విడుదల చేయలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం వద్ద నుండి రాష్ట్రం తీసుకోవడానికి ప్రధాన కారణం కాంట్రాక్టర్ నుండి కమీషన్లు తీసుకోవాలన్నదే చంద్రబాబు దురుద్దేశం అని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. పోలవరం కోసం ఏమీ చేయలేదని చెప్పటం అవాస్తం అన్నారు.

”2016లో 2013-14 రేట్లకే పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. 2013-14 రేట్లు ప్రకారం పోలవరం ఖర్చు 20938 కోట్లే. చంద్రబాబు మాటలు వింటుంటే మా అల్లుడు నాకంటే నటుడు అన్న ఎన్టీఆర్ మాటలు గుర్తుకొస్తున్నాయి. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా చేసినా ప్రాజెక్టు పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు ఒకేసారి ప్రారంభించడంతో సమస్యలు వచ్చాయి. దీనికి బాధ్యత చంద్రబాబే వహించాలి. జగన్ పై విషంకక్కే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం కక్కుర్తి పడటంతోనే పోలవరానికి శనిలా పట్టుకున్నారు. రూ.55,656 కోట్లు ఖర్చు అవుతుందని రివైజ్ కాస్ట్ లెక్కలు వేసి కేంద్రానికి పంపించాం. రూ.47,755 కోట్ల ఖర్చుకు కేంద్రం ఒప్పుకుంది. ఎన్నికలకు ముందే తొలి దశ ఖర్చుకు కేంద్ర క్యాబినెట్ అమోదం తెలిపాల్సింది. చంద్రబాబు అడ్డుకోవడంతోనే అప్పుడు క్యాబినెట్ లో పెట్టకుండా ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ లో పెట్టారు” అని ధ్వజమెత్తారు అంబటి రాంబాబు.

పార్టీ మారడం అంటే క్యారెక్టర్ కోల్పోవడమే- అంబటి రాంబాబు
వైసీపీ నుంచి వలసల అంశంపైనా అంబటి రాంబాబు స్పందించారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడతారని జరుగుతున్న ప్రచారంపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేవారు. పార్టీలు మారడం మంచి పద్ధతి కాదన్నారు. వైఎస్ జగన్ కు మోపిదేవి వెంకటరమణ సన్నిహితుడని చెప్పారు. ఎమ్మెల్యేగా మోపిదేవి ఓడినా.. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. మోపిదేవి వైసీపీని వీడతారని అనుకోవడం లేదన్నారు అంబటి రాంబాబు. పార్టీ మారడం అంటే క్యారెక్టర్ ను కోల్పోవడమే అని అంబటి చెప్పారు. అధకారం శాశ్వతం కాదని నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు రాజకీయ జీవితం అందరికీ తెలుసు అని మండిపడ్డారు అంబటి రాంబాబు.

 

Also Read : అల్లు అర్జున్ కామెడీ యాక్టర్‌.. హీరో కాదు‌: విరుచుకుపడ్డ జనసేన పార్టీ నాయకులు