‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. శనివారం వస్తే నాని ఏం చేస్తాడు..?

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు.

‘సరిపోదా శనివారం’ మూవీ రివ్యూ.. శనివారం వస్తే నాని ఏం చేస్తాడు..?

Saripodhaa Sanivaaram Review

వరుస సినిమాలతో దూసుకుపోతున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘సరిపోదా శనివారం’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా SJ సూర్య నెగిటివ్ రోల్ చేశాడు. ట్రైలర్ తో మంచి అంచనాలు నెలకొల్పిన సరిపోదా శనివారం సినిమా నేడు ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

కథ విషయానికొస్తే.. సూర్య(నాని)కి చిన్నప్పట్నుంచి కోపం ఎక్కువ. సూర్య తల్లి(అభిరామి) అతని చిన్నప్పుడే చనిపోయేముందు కోపం కంట్రోల్ చేసుకోమని, కావాలంటే ఆ కోపాన్ని వారంలో ఒక్క రోజే చూపించమని, ఈ వారం రోజులు ఆ కోపానికి కారణం కరెక్ట్ అయితేనే కోపం చూపించమని చెప్తుంది. దీంతో సూర్య తనకు వచ్చిన కోపాలన్నీ బేరీజు వేసుకొని శనివారం పూట చూపిస్తూ ఉంటాడు. చిన్నప్పట్నుంచీ తన మరదలు కళ్యాణి అంటే ఇష్టం కానీ అనుకోకుండా తన మరదలు కుటుంబం దూరమవుతుంది. పెద్దయ్యాక లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ అక్క పెళ్ళిలో అక్కకి కాబోయే మామయ్యని తన శనివారం కోపంతో కొట్టి గొడవ పెట్టుకోవడంతో అక్క సూర్యకు దూరంగా ఉంటుంది.

దయానంద్(SJ సూర్య) రాక్షసుడి లాంటి పోలీస్. వాళ్ళ అన్న కూర్మానంద్(మురళి శర్మ) తనకు రావాల్సిన ఆస్తిని ఇవ్వట్లేదని అతని మీద కోపం సోకులపాలెంలోని అమాయక ప్రజల మీద చూపిస్తూ ఉంటాడు. ఒకప్పుడు నేరాలు చేసి బతికిన ఊరు మారినా తన అన్నని రాజకీయాల్లో గెలిపించినందుకు దయానంద్ వాళ్లపై విరుచుకుపడుతూ ఉంటాడు. దయానంద్ స్టేషన్ లో చారులత(ప్రియాంక మోహన్)కొత్తగా లేడీ కానిస్టేబుల్ గా చేరుతుంది. అనుకోకుండా ఓ రోజు దయానంద్ కోపం వల్ల సూర్యతో పరిచయం ఏర్పడుతుంది. అసలు సూర్య శనివారం మాత్రమే కోపం చూపించడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏంటి? సూర్య – చారులతలు ప్రేమలో పడతారా? సూర్య అక్క తమ్ముడికి మళ్ళీ దగ్గరైందా? సూర్య చిన్నప్పటి మరదల్ని కలుస్తాడా? కూర్మానంద్ తన తమ్ముడికి ఆస్తిని ఇస్తాడా? అసలు దయానంద్ గొడవల్లోకి సూర్య ఎందుకు ఎంటర్ అయ్యాడు? సోకులపాలెం ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు నాడే కాంట్రవర్సీలకు పుల్‌స్టాప్ పడబోతోందా?

సినిమా విశ్లేషణ.. సాధారణంగా నాని రెగ్యులర్ కథలే చేసినా వాటిల్లో ఏదో కొత్తదనం చూపిస్తాడు. ఇప్పుడు సరిపోదా శనివారంలోను అదే చేసాడు. ఓ హీరో.. హీరోయిన్ వల్ల ఒక ఏరియాలోని ప్రజల కోసం నిలబడటం అనే రెగ్యులర్ కథని అమ్మ ఎమోషన్, శనివారం మాత్రమే తన కోపం చూపించడం అనే పాయింట్స్ తో కొత్తగా సరిపోదా శనివారంలో చూపించారు. అయితే సినిమా కథని నవలగా కొన్ని విభాగాలుగా విడగొట్టి వివేక్ ఆత్రేయ తనదైన స్టైల్ లో స్క్రీన్ ప్లే చూపించాడు.

ఫస్ట్ హాఫ్ సూర్య చిన్నతనం, సూర్య పెద్దయ్యాక ఎలా ఉన్నాడు, చారులత పరిచయం, ప్రేమ, దయానంద్ గొడవలోకి ఎంటర్ అవ్వడంతో సాగుతుంది. సెకండ్ హాఫ్ అసలు దయానంద్ – సూర్య ఎలా ఎదురుపడ్డారు? సోకులపాలెం ప్రజల సంగతేంటి? సూర్య అక్క, ఫ్యామిలీ ఎమోషన్ తో సాగుతుంది. నాని ఎప్పట్నుంచో మాస్ హీరో అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. దసరాతో మాస్ హీరో అనిపించుకున్న ఈ సరిపోదా శనివారం కూడా మళ్ళీ అలాంటి ప్రయత్నమే. సినిమాలో కొత్తదనం లేకపోయినా హీరో, విలన్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా దాదాపు మూడు గంటల నిడివి సినిమాని బాగానే చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ లు, ఎలివేషన్ షాట్స్ మాత్రం అదరగొట్టారు. సినిమాలో నాని గత సినిమాలు, ఈగ సినిమా, సమంత రిఫరెన్స్ లు బాగానే పనిచేసాయి. అక్కడక్కడా కామెడీ వర్కౌట్ అయింది. నాని ఫ్యాన్స్ కి మాత్రం సినిమా బాగానే నచ్చుతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాల్లోలాగే నాని తన బెస్ట్ ఇచ్చాడు. కానీ ఇందులో నట రాక్షసుడు అనిపించుకునే SJ సూర్య నానికి విలన్ గా నటించడంతో కొన్నిచోట్ల SJ సూర్య నానిని డామినేట్ చేసాడు అనిపిస్తుంది. విలన్ గా SJ సూర్య పోలీస్ పాత్రలో అదరగొట్టేసాడు. కానిస్టేబుల్ పాత్రలో ప్రియాంక మోహన్ క్యూట్ గా మెప్పించింది. తల్లి పాత్రలో అభిరామి కాసేపే కనిపించినా మంచి ఎమోషన్ పండించింది. నాన్న పాత్రలో సాయి కుమార్ బాగా నటించారు. అక్క పాత్రలో అదితి బాలన్ కూడా ఎమోషన్ పండించింది. మురళీ శర్మ కూడా తన సరికొత్త నటనతో ఆకట్టుకుంటారు. సోకుల పాలెం ప్రజలుగా చేసిన నటీనటులు, మిగిలిన ఆర్టిస్టులు అందరూ కూడా బాగా నటించారు.

Pawan Kalyan – Gabbar Singh : అప్పుడే పవన్ పుట్టిన రోజు వేడుకల రచ్చ షురూ.. ఇది సింగిల్ స్క్రీన్ కాదు మల్టీప్లెక్స్ దగ్గర..

సాంకేతిక అంశాలు.. సినిమా టెక్నికల్ గా మాత్రం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్, లైటింగ్ సెటప్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జెక్స్ బిజోయ్ అదరగొట్టాడు. పాటలు మాత్రం యావరేజ్. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు. కథ రెగ్యులర్ కథే. స్క్రీన్ ప్లే మాత్రం వివేక్ ఆత్రేయ తన స్టైల్ లో ట్రై చేసినా ఇది కూడా చాలా సినిమాల్లో చూసేసాం అనిపిస్తుంది. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. సినిమా ఎలా ఉన్నా వివేక్ బెస్ట్ అవుట్ పుట్ ఇస్తాడు. ఇక ఈ సినిమా నాని కెరీర్లో అత్యధిక బడ్జెట్ అని టాక్ వచ్చింది. దానికి తగ్గట్టే నిర్మాణ పరంగా DVV ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ గానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.

మొత్తంగా ‘సరిపోదా శనివారం’ సినిమా హీరోకి వచ్చిన కోపం వారమంతా దాచుకొని శనివారం మాత్రమే చూపిస్తుంటే అతను ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసాడు అని యాక్షన్ ఎంటర్టైనర్ గా చూపించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.