Shahid Afridi : 37 బంతుల్లో షాహిద్ అఫ్రిది సెంచ‌రీ.. స‌చిన్ టెండూల్క‌ర్‌కు సంబంధం ఉందా..? ఓరి నాయ‌నో..

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది ని అభిమానులు ముద్దుగా బూమ్ బూమ్ అఫ్రిది అని పిలుచుకుంటూ ఉంటారు.

Shahid Afridi : 37 బంతుల్లో షాహిద్ అఫ్రిది సెంచ‌రీ.. స‌చిన్ టెండూల్క‌ర్‌కు సంబంధం ఉందా..? ఓరి నాయ‌నో..

Behind Shahid Afridis 37 Ball Century The Sachin Tendulkar Factor

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షాహిద్ అఫ్రిది ని అభిమానులు ముద్దుగా బూమ్ బూమ్ అఫ్రిది అని పిలుచుకుంటూ ఉంటారు. అఫ్రిది 1996లో శ్రీలంక జ‌రిగిన ఓ వ‌న్డే మ్యాచులో 37 బంతుల్లోనే శ‌త‌కం చేసి ఫాస్టెస్ట్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా రికార్డు సృష్టించాడు. దాదాపు 18 సంవ‌త్స‌రాల పాటు ఈ రికార్డు అఫ్రిది పేరు పైనే ఉంది. 2014లో న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ కోరే అండ‌ర్స‌న్ 36 బంతుల్లో శ‌త‌కం బాది అఫ్రిది రికార్డును బ్రేక్ చేశాడు. ఓ ఏడాది గ‌డిచిందో లేదో 2015లో వెస్టిండీస్ పై ఏబీ డివిలియ‌ర్స్ 31 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు.

కాగా.. ఎన్నో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్‌లు ఆడిన‌ప్ప‌టికి కూడా శ్రీలంక పై 37 బంతుల్లో చేసిన సెంచ‌రీ త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకం అని ఓ ఇంట‌ర్వ్యూలో షాహిద్ అఫ్రిది వెల్ల‌డించాడు. ఎందుకంటే ఆ శ‌త‌కాన్ని టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ బ్యాట్‌తో చేసిన‌ట్లుగా వెల్ల‌డించాడు. ‘లంక పై సెంచ‌రీ చేసిన బ్యాట్ ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే అభిమాన క్రికెట‌ర్ల‌లో ఒక‌డైన టెండూల్క‌ర్ బ్యాట్ అది. అత‌డి బ్యాట్‌తోనే వ‌ర‌ల్డ్ రికార్డు సాధించాను. ఇందుకు వ‌కార్ యూనిస్‌కు కూడా ధ‌న్య‌వాదాలు. లంక‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండ‌గా వ‌కార్ ఈ బ్యాట్‌ను ఇచ్చాడు. దానితోనే ఆడ‌మ‌ని అడిగాడు.’ అని అఫ్రిది తెలిపాడు.

Vindhya Vishaka : బాబోయ్.. యాంకర్ వింధ్య విశాఖ హాట్ ఫొటోలు..

ఇక ఆ బ్యాట్‌తో త‌రువాత మ‌రికొన్ని మ్యాచులు ఆడాల‌ని అనుకున్న‌ట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. దానిని కాపాడుకోవాల‌ని అనుకున్నాన‌ని, అందుక‌నే దాన్ని దాచిపెట్టిన‌ట్లు వెల్ల‌డించాడు.

నెట్స్‌లో దంచికొట్టాడు..
అజ‌ర్ మహమూద్ మాట్లాడుతూ.. ఆ స‌మ‌యంలో శ్రీలంక ఓపెన‌ర్లు స‌న‌త్ జ‌య‌సూర్య‌, కులువిత‌ర‌ణలు ఇద్ద‌రూ దూకుడుగా ఆడేవారన్నారు. వారిని క‌ట్ట‌డి చేయ‌డం చాలా క‌ష్టంగా ఉండేద‌న్నారు. ఈ క్ర‌మంలో పాక్ జ‌ట్టులో సైతం ఒక‌రు దూకుడుగా ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని అది మూడో స్థానంలో వ‌చ్చే ఆట‌గాడు అయి ఉండాల‌ని అనుకున్న‌ట్లుగా చెప్పాడు. తాను లేదంటే అఫ్రిది ఇద్ద‌రిలో ఒకరు మూడో స్థానంలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లుగా తెలిపాడు.

IPL 2025 : గౌత‌మ్ గంభీర్ ఔట్‌.. అత‌డి స్థానంలో శ్రీలంక దిగ్గ‌జం ?

కెప్టెప్ వ‌సీమ్ అక్ర‌మ్‌.. త‌మ‌ను నెట్స్‌లో ప్రాక్టీస్ చేయ‌మ‌ని చెప్పాడు. ఇక అఫ్రిది నెట్స్‌లో స్పిన్న‌ర్ల‌పై విరుచుకుప‌డ్డాడు. దీంతో అంద‌రూ హ‌డ‌లిపోయిన‌ట్లుగా మ‌హ‌మూద్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ త‌రువాతి రోజు లంక‌తో మ్యాచ్ లో అఫ్రిది వ‌న్‌డౌన్‌లో వెళ్లాడని, స‌చిన్ ద‌గ్గ‌ర నుంచి వ‌కార్ బ్యాట్‌ను తెచ్చాడని, దీంతోనే అఫ్రిది సెంచ‌రీ చేసిన‌ట్లుగా వెల్ల‌డించాడు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు బౌలర్‌గానే రాణిస్తున్న అఫ్రిది అప్ప‌టి నుంచి పాక్ జ‌ట్టులో కీల‌క బ్యాట‌ర్ల‌లో ఒక‌డిగా మారిపోయాడ‌ని అన్నాడు.