ఏపీలో 1, 25, 229 కోవిడ్ 19 పరీక్షలు

  • Published By: madhu ,Published On : May 4, 2020 / 08:19 AM IST
ఏపీలో 1, 25, 229 కోవిడ్ 19 పరీక్షలు

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ సంఖ్యలోనే రిజిష్టర్ అవుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 50కి పైగానే కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు.

కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ప్రధానంగా..దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడా లేని విధంగా ఏపీలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రం చేయని విధంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తూ..ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. 

2020, మే 04వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల వరకు 1, 25, 229 కోవిడ్ 19 పరీక్షలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఉదయానికి 67 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మొత్తం 1650 కు చేరుకున్నాయి. 524 మంది డిశ్చార్జ్ కాగా..33 మంది మరణించారని వెల్లడించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 1093గా తెలిపింది. కర్నూలు లో 500 కేసులు దాటే సూచనలు కనిపిస్తున్నాయి. 

Also Read | ఏపీలో కరోనా : హెల్త్ బులెటిన్..కొత్తగా 67 కేసులు