AP Assembly : సీఎం జగన్‌‌పై సభా హక్కుల నోటీసు, 11 మంది టీడీపీ సభ్యుల సస్పెండ్..

బుధవారం పది మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు...

AP Assembly : సీఎం జగన్‌‌పై సభా హక్కుల నోటీసు, 11 మంది టీడీపీ సభ్యుల సస్పెండ్..

Ap Assmebly

Andhrapradesh TDP : కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించి సభను, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంటూ… ఉభయ సభల్లో సభా హక్కుల నోటీసు ఇచ్చారు టీడీపీ సభ్యులు. గత కొన్ని రోజులుగా అసెంబ్లీ, మండలిని జంగారెడ్డి గూడెం ఘటన కుదిపేస్తోంది. కల్తీ సారా వల్లే మరణాలు సంభవించాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంటే.. కామన్ సెన్స్ లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని అధికార పార్టీ మండిపడుతోంది. ఈ విషయంపై అసెంబ్లీలో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్న ఐదుగురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు. తాజాగా 2022, మార్చి 16వ తేదీ బుధవారం 11 మందిని ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. వెంటనే సభలో నుంచి వెళ్లిపోవాలని సూచించారు. సస్పెండ్ అయిన వారిలో చినరాజప్ప, రామకృష్ణ బాబు, మంతెన రామరాజు, జోగేశ్వర్ రావు, గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, అశోక్, భవానీ, వెంకట నాయుడు, రామ్మోహన్ రావులను సస్పెన్స్ చేశారు.

Read More : Half-Day Schools : ఏపీలో ఏప్రిల్ మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు

కల్తీ సారా తాగి జనాలు చనిపోతుంటే ప్రభుత్వం తప్పుడు వివరణ ఇస్తున్నదని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో సభలో రచ్చ చేస్తోన్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయాలంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం.. వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. అయితే కల్తీసారాపై క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్. చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారని.. నిఘా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సారా తయారీ సాధ్యమా అని నిలదీశారు.

Read More : Jagananna Vidya Deevena Money : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు

సారాపై వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు ముఖ్యమంత్రి. అక్రమ మద్యం అడ్డుకోవడానికి ప్రత్యేక వ్యవస్థ తెచ్చాయమన్నారు. రెండేళ్లలో 13 వేల కేసులను నమోదు చేశామన్నారు. కల్తీ మద్యం తయారు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సీఎం జగన్‌.