AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా

సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు ఇంకా సస్పెన్షన్ కాపీ అందలేదని, సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు.

AB Venkateswara Rao: జగన్, ఆమెకు ఒక న్యాయం.. నాకు ఒక న్యాయమా? మళ్లీ కోర్టుకు వెళ్తా

AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసిన విషయం విధితమే. ఈ విషయంపై ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాకు ఇంకా సస్పెన్షన్ కాపీ అందలేదని, సోషల్ మీడియాలో మాత్రమే చక్కర్లు కొడుతుందని వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. నామీద ఎటువంటి చార్జ్ షీట్ లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్ పై ఈడీ చార్జ్‌షీట్‌లు ఇతరత్రా ఉన్నాయని, ఆయనకు లేనిది నాకు ఎందుకు వర్తిస్తుందని ప్రశ్నించారు. శ్రీలక్ష్మి పైన చార్జ్ షీట్లు ఉన్నాయని, మరి ఆమెకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అంటూ నిలదీశారు. నేను న్యాయ పోరాటం కొనసాగిస్తానని, మళ్లీ కోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. క్రమశిక్షణ లోపం అనేది అబద్ధమన్నారు.  ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం వాస్తవం, కేసులో ఇప్పటిదాకా చార్జ్ షీట్ వేయలేదని అన్నారు. ట్రైలే లేకుండా విక్టిమ్స్ ని ఎలా ప్రభావితం చేస్తానని వెంకటేశ్వరరావు అన్నారు. ఒకే అంశంపై ఎవరైనా రెండు సార్లు చర్యలు తీసుకుంటారా? న్యాయ సమీక్షలో ఇవి చెల్లవని, నామీద ఎటువంటి చార్జ్ షీట్ లేదని వెంకటేశ్వరరావు అన్నారు.

AB Venkateshwar Rao: మరోసారి ఏబీవీని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

నాపైన ఆరోపణలు చేస్తున్న దానిపై ఆయా‌ కంపెనీ మేము ఎటువంటి కమిషన్లు, లంచాలు ఇవ్వలేదని చెప్పినా ఏసీబీ కేసు ఏమిటని ప్రశ్నించారు. ఆఫీసర్లు చేసే పనుల వలన ప్రభుత్వానికి, వ్యవస్ధలకు చెడ్డ పేరు వస్తుందని, ప్రతిఒక్కరికి పరిమితులు ఉంటాయని, పరిమితులు దాటి ప్రవర్తిస్తే రెండేళ్ల తర్వాతైనా సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ విషయంలో తాను ఎవరినైనా వదిలిపెట్టనని అన్నారు. ఇప్పుడు నన్ను ప్రభుత్వం టార్గెట్ చేయడం లేదని, కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు టార్గెట్ చేస్తున్నాయని, అందుకు కారణాలు చాలా ఉన్నాయని తెలిపారు.  నేను ఐబీ చీఫ్ గా పనిచేసినప్పుడు రాష్ట్రాన్ని తగలబెట్టాలని చూస్తే అడ్డుకున్నానని అన్నారు. కోడి కత్తి కేసు ను తక్కువ సమయంలోనే నిలువరించినందుకే నాపైన కోపంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. 23మంది వైసీపీ ఎమ్మెల్యే లు.. టీడీపీలోకి రావడం వెనుక తనకేం సంబంధమన్నారు. విచారించి..తన ప్రమేయం ఉంటే చర్యలు తీసుకోవచ్చునన్నారు. ఇదే అంశాన్ని చెప్పుకుని ఎంతకాలం ప్రచారం చేస్తారన్నారు. రాజకీయ నాయకులు వారి పని వారు చూసుకుంటారు నాకేం సంబంధం, నేను చేశాను ఆంటే కేసు పెట్టండి అని వెంకటేశ్వరరావు అన్నారు.

Hyderabad: ‘సాలు మోదీ.. సంపకు మోదీ’.. హైదరాబాద్‌లో ఫ్లెక్సీల వార్..

నాపైన పెట్టిన ఎఫ్ఐఆర్ లోప భూయిష్టమని, నాపైన ఇంకా రెండు పిటిషన్లు ఉన్నాయని, అవి తొందరగా ముగించమని కోరుతున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంక్వైరీ సమయంలో దొంగ పత్రాలు పెట్టారని, వాటిపైన లీగల్ గా వెళతానని తెలిపారు. నెల్లూరు కు చెందిన ప్రజా ప్రతినిధి వైసిపి గెలిచాక నా అంతు చూస్తామని కాల్ చేశాడని, ఇప్పుడు బోరు న ఏడ్చే పరిస్ధితి అన్నారు. న్యాయ పోరాటం లో న్యాయం దొరక్క పోతే ధర్మ పోరాటం చేస్తానని, మూడేళ్లైన ఒక్క తప్పైనా నిరూపించాలిగారా అని ప్రశ్నించారు. నేను అసోసియేషన్ సెక్రటరీ గా ఉన్నప్పుడు అన్యాయం పై నేను పోరాడానని, కానీ ఇప్పటివరకు స్పందించలేదని, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చెడుపై వ్యవసాయం చేస్తూనే ఉన్నానని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.