Andhra Pradesh : ఈవో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కోటప్పకొండ అర్చకుల ఆగ్రహం

కోటప్ప కొండ అర్చకులు ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈవో గోపి తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

Andhra Pradesh : ఈవో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కోటప్పకొండ అర్చకుల ఆగ్రహం

andhra pradesh kotappakonda temple

andhra pradesh : పల్నాడు జిల్లాలో పేరుపొందిన కోటప్ప కొండ (Kotappakonda) అర్చకులు ఈవోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈవో గోపి తమపట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తు ఆరోపించారు. తమ మనోభావాలు దెబ్బతీనేలా ఈవో గోపి వ్యవహరం ఉందని.. అతని వైఖరి ఏమాత్రం బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అర్చకులు. గురువారం (మే4, 2023) నుంచి ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నాం అంటూ అర్చకులు నోటీసులు ఇచ్చారు.

అర్చకుల ఆరోపణలపై ఈవో వేమూరి గోపి స్పందించారు. అర్చకులతో తాను అభ్యంతరకరంగా ప్రవర్తించలేదంటూ వివరించారు. అర్చకులకు ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు. కాగా కోటప్పకొండ దేవాలయంలో ఆగమశాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదని అర్చకులు ఆరోపిస్తున్నారు. ఈవో గోపి తమపట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నారని పరుష పదాలతో దుర్భాషలాడుతున్నారని అర్చకులు ఆరోపిస్తున్నారు.

కానీ అర్చకుల ఆరోపణలను ఈవో గోపీ కొట్టిపారేశారు. వారికేమన్నా సమస్యలు ఉంటే చర్చించుకుంటామని తానేమి అసభ్యకరంగా వ్యవహరించలేదని అంటున్నారు. ఈవో గోపి అర్చకుల మధ్య వచ్చిన ఈ వివాదంతో సమస్యను పరిష్కరించటానికి దేవదాయశాఖ ఉన్నతాధికారులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది.

Also Read: తిరుమలలో ఉగ్రవాదులు? క్లారిటీ ఇచ్చిన ఎస్పీ