Cheddi Gang : పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్

ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెడ్డీ గ్యాంగ్ ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని దాహోడ్ జిల్లాలో స్థానిక పోలీసుల సాయంతో వీరిని పట్టుకున్నారు.

Cheddi Gang : పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్

Cheddi Gang (2)

Updated On : December 14, 2021 / 1:03 PM IST

Cheddi Gang : ఏపీలో గత కొద్దీ రోజులుగా చెడ్డి గ్యాంగ్స్ అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే.. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో కూడా చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. భారీ భద్రత ఉండే ఇళ్లలోకి కూడా చొరబడి దోపిడీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు చెడ్డి గ్యాంగ్ భరతం పట్టేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, గతంలో నేరాల ఆధారంగా చెడ్డి గ్యాంగ్ సభ్యులు గుజరాత్‌కి చెందిన వారీగా గుర్తించారు పోలీసులు.

చదవండి : Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్ కోసం గాలింపు.. గుజరాత్ వెళ్లిన బెజవాడ పోలీసులు

వారి ఆట కట్టించేందుకు గుజరాత్ వెళ్లారు. అక్కడ స్థానిక పోలీసుల సహకారంతో అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తమకు దొరికిన వారిని విచారించి మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు పోలీసులు. కాగా గుజరాత్ లో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

చదవండి : cheddi gang In AP :బెజవాడను బేజారెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్..పోలీసులకు సవాల్ గా వరుస దోపిడీలు