ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : November 17, 2020 / 06:43 PM IST
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

రోజుకు పది వేల కేసులు నమోదై దేశవ్యాప్తంగా రాష్ట్రం గురించి ఆందోళన కలిగేలా వచ్చిన కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 66,778శాంపిల్స్‌ను పరీక్షించగా..1,395 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 856159కు చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.



రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో ఇద్దరు.. కృష్ణాలో ఇద్దరు.. విశాఖపట్నంలో ఇద్దరు.. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6890కు చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 2,293 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 832284 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16985యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 92,64,085 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



కరోనా తీవ్రదశలో రోజుకు పదివేల పైగా కేసులు నమోదవుతూ జాతీయ స్థాయిలో కలవరం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏపీని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.