Minister Jogi Ramesh: పేదల పక్షాన నిలబడేది జగన్.. పేదలకు మంచి జరిగితే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు..
ప్రతి ఇంటివద్ద మద్యాన్ని ఏరులైపారించిది చంద్రబాబు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేక అల్లాడుతాడు. అలాంటి చంద్రబాబు పేదలను ధనికులను చేస్తాడా?

Minister Jogi Ramesh
Andhra pradesh: రాష్ట్రంలో ప్రతీపేదవాడు బాగుపడాలనే మంచి ఉద్దేశం కలిగిన వ్యక్తి ఏపీ సీఎం (AP CM) జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) .. పేదలు బాగుపడితే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అంటూ మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సంవత్సరానికి 12 సిలీండర్లకు ఐదేళ్లలో ఆరు వేలు సబ్సీడీ ఇస్తానని మ్యానిఫెస్టోలో చంద్రబాబు చెప్పాడు. 14ఏళ్లలో ఒక్క పైసా సబ్సీడీ ఇచ్చాడా? 14,500 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ రుణమాఫీ చేస్తానన్నాడు. ఆ హామీని నెరవేర్చలేదు. అబద్దపు మాటలు చెప్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ జోగి రమేష్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ప్రతి ఇంటివద్ద మద్యాన్ని ఏరులైపారించిది చంద్రబాబు. పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేక అల్లాడుతాడు. అలాంటి చంద్రబాబు పేదలను ధనికులను చేస్తాడా? ఎవరైనా ఈ హామీని నమ్ముతారా అంటూ జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పేదల పక్షాన నిలబడేది సీఎం జగన్ అని. నాలుగేళ్లలో పేదలకు అన్నివిధాల జగన్ అండగా ఉంటూ వస్తున్నారని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు, పోలవరం ప్రాజక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు.
Devineni Uma : గెలుస్తామనే బలుపు .. 2019లో అందుకే ఓడిపోయాం : దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు నువ్వు కేంద్ర ప్రభుత్వంలో వుండి నీ పాలనలో ఏం చేశావ్ అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు కాదు.. చంద్రబాబా.. కాషాయ బట్టలు వేసుకుంటే బాబాలాగే వుంటాడు అంటూ ఎద్దేవా చేశారు. మా మంత్రులను వెటకారంగా చంద్రబాబు తిట్టాడు. మేము లోకేశ్‌లాగా మంత్రి కాలేదు. అడ్డదారిలో నీ కొడుకును మంత్రిని చేశావ్. ప్రజల నుంచి నీ కొడుకును గెలిపించలేవు. ఎమ్యెల్యేగా ఎన్నిక అయ్యే అర్హత పప్పుకు లేదంటూ జోగి రమేష్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
Lokesh Padayatra : లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు ఫ్యాషన్ యాత్ర : అకేపాటి అమర్నాథ్ రెడ్డి
మీ కుటుంబం దొడ్జిదారి కుటుంబం. మేము ఉప్పుకారం తిని, దమ్ము ధైర్యంతో వున్నవాళ్లం. సుప్రీంకోర్టు సైతం జైజగన్ అనింది. పిల్లకుంక లోకేశ్.. జగన్ అంటే ఏమనుకున్నావ్. జగన్‌రెడ్డితో నీకు చర్చలు ఏమిటి? లోకేశ్.. ఒళ్లు తగ్గించుకోవడానికి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. వైఎస్‌ఆర్, వైఎస్ జగన్‌లు పాదయాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. 2024 ఎన్నికల్లో 151 స్థానాల పైచిలుకు గెలుస్తాం. జగన్ తీసుకున్న నిర్ణయాలుచూసి ఉద్యోగులంతా జై జగన్ అంటున్నారు అని మంత్రి జోగి రమేష్ చెప్పారు.