AP PRC : పీఆర్సీ రగడ.. ఏకతాటి మీదకు 4 ఉద్యోగ సంఘాలు, హోటల్‌లో సీక్రెట్ సమావేశం

ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.

AP PRC : పీఆర్సీ రగడ.. ఏకతాటి మీదకు 4 ఉద్యోగ సంఘాలు, హోటల్‌లో సీక్రెట్ సమావేశం

Ap Prc

AP PRC : ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై వివాదం ముదురుతోంది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. కాగా, వేర్వేరుగా ఆందోళనలు చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఏకతాటి మీదకు వచ్చాయి.

ఇప్పటివరకు నాలుగు గ్రూపులుగా ఉన్న సంఘాలు ఇప్పుడు అంతా కలిశారు. ఓ ప్రైవేట్ హోటల్ లో నాలుగు సంఘాలకు చెందిన కీలక నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. ఉద్యోగ సంఘాల నాయకులు మంతనాలు జరుపుతున్నారు. రాత్రి 7 గంటలకు నాలుగు సంఘాలు జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు తమ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు చర్చలు జరుపుతున్నారు.

Blood Clots : గుండె రక్త నాళాల్లో పూడికలు….ఎవరిలో ఎక్కువంటే?

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని, జీతాలు తగ్గుతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. రేపు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఉద్యోగులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లించేలా అన్ని ట్రెజరీ ఆఫీసులకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగానే జీతాల్లో మార్పులను చేయాలని ఆదేశాలిచ్చింది. ఇటు జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ కొత్త సాఫ్ట్ వేర్ నూ సిద్ధం చేసి పెట్టింది.